•హిందూపూర్ కంచుకోటని వైసిపి బద్దలు కొడుతుందా..

•బలాబలాలు ఆ పార్టీకేనా

•నారా - నందమూరి మళ్లీ హిందూపూర్ ని కైవసం చేసుకుంటారు..



(హిందూపూర్ - ఇండియా హెరాల్డ్)

హిందూపూర్ టిడిపి కంచుకోటగా గత కొన్ని సంవత్సరాలుగా చెప్పుకుంటున్న విషయం తెలిసిందే.. అయితే ఈసారి కూటమిలో భాగంగా హిందూపూర్ మళ్లీ నారా - నందమూరి వశం కావాలి అని పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇందుకు అంతే దీటుగా ఆ కంచుకోటని బద్దలు కొట్టే ప్రయత్నం చేస్తోంది.. అధికార పార్టీ వైసిపి.. ఇక శ్రీ సత్య సాయి జిల్లా పార్లమెంటులో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. అందులో ఏ నియోజకవర్గంలో కూటమి లేదా వైసిపి ఎవరు తమ అదృష్టాలను పరీక్షించుకోబోతున్నారు?  ఎవరు తమ జెండాను ఎగరవేస్తారు ? అన్నది ఉత్కంఠ భరితంగా మారింది.. ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు కేవలం ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటూ అధికారులు అభ్యర్థులలోనే కాదు ప్రజలలో కూడా ఈ విషయం ఉత్కంఠ గా మారింది.. మరి ఎవరు అధికారంలోకి వస్తారు అనే విషయాన్ని అధికారులు , అభ్యర్థులలోనే కాదు ప్రజలలో కూడా ఈ విషయం ఉత్కంఠ గా మారింది . ఇకపోతే ప్రత్యేకించి శ్రీ సత్య సాయి జిల్లా పార్లమెంటులో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలలో ఏ  పార్టీది పై చేయి అవుతుందో ఇప్పుడు ఒకసారి చిన్న విశ్లేషణ ద్వారా చూద్దాం..

మడకశిర:

వైసీపీ తరఫున ఈరలక్కప్ప పోటీ చేస్తూ ఉండగా..  టిడిపి కూటమిలో భాగంగా ఎమ్మెస్ రాజు టికెట్టు దక్కించుకున్నారు. ఇక ఇక్కడ పోటాపోటీలో ఎవరు గెలుస్తారు అనే విషయానికి వస్తే.. ఈర లక్కప్ప కి  అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.. మరొకవైపు ఎమ్మెస్ రాజు కి సామాజిక వర్గ బలం ఎక్కువగా ఉన్నా.. కొన్ని కారణాలవల్ల ఆయనకు వ్యతిరేకత ఏర్పడుతోంది.

పెనుగొండ:
వైసీపీ తరఫున కె.వి ushashri CHARAN' target='_blank' title='ఉషశ్రీ చరణ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఉషశ్రీ చరణ్ పోటీ పడుతుండగా టిడిపి కూటమిలో భాగంగా కురుబ సవిత పోటీ పడుతున్నారు.. అయితే ఇక్కడ కె.వి ushashri CHARAN' target='_blank' title='ఉషశ్రీ చరణ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఉషశ్రీ చరణ్ కి ఎక్కువగా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి..

హిందూపురం:
వైసిపి తరఫున దీపిక పోటీ పడుతుండగా టిడిపి అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ బరిలోకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో సీటు దక్కించుకున్న నందమూరి బాలకృష్ణ ఈసారి కూడా మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పుట్టపర్తి:
వైసీపీ తరఫున దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పోటీకి దిగుతుండగా.. టిడిపి తరఫున పల్లె సింధూర రెడ్డి బరిలోకి దిగుతున్నారు. ప్రచారంలోకి వచ్చిన మొదటి రోజే ..ఈమె కళ్ళు తిరిగి పడిపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.. ఇకపోతే పుట్టపర్తి ఎవరి వశం కాబోతున్నది ఇక్కడ ఉత్కంఠ గా మారుతుంది.

ధర్మవరం:
కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వైసీపీ తరఫున పోటీకి దిగుతుండగా కూటమి అభ్యర్థి బిజెపి తరఫున వై. సత్యకుమార్ బరిలోకి దిగుతున్నారు. అయితే ఇక్కడ కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అధికారంలోకి వస్తారని సమాచారం.

కదిరి:
వైసీపీ తరఫున మక్బూల్ అహ్మద్ బరిలోకి దిగుతుండగా టిడిపి తరఫున కందికుంట వెంకటప్రసాద్ పోటీకి సిద్ధమవుతున్నారు.. ఇక్కడ మక్బూల్ అహ్మద్ కి ఎక్కువగా అవకాశాలున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: