ఇటీవల కాలంలో దేశంలో ఎక్కడ చూసినా మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి తప్ప ఎక్కడ తగుముఖం పట్టడం లేదు అన్న విషయం తెలిసిందే. ఇక వెలుగులోకి వచ్చిన ఘటనలను చూసిన తర్వాత సభ్య సమాజంలో బ్రతుకుతుంది మనుషులా. లేకపోతే మనుషుల రూపంలో ఉన్న మానవ మృగాలా అనే అనుమానం ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది.ఎందుకంటే ఇక మంచి వాళ్ళలా నాటకమాడుతున్న ఎంతోమంది మానవ మృగాలు సమయం సందర్భం చూసి తమలో ఉన్న కామాంధుని బయటపెడుతున్నారు.


వెరసి ఇక ఆడపిల్ల ఒంటరిగా కనిపించింది అంటే చాలు ఇక అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఇక మరి కొంతమంది కామాంధులు అయితే ఇంకా తెగిస్తూ ఉన్నారు. పక్కనే కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ వారిపై దాడి చేసి మరి అత్యాచారాలు చేస్తున్న ఘటనలు సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయ్. ఇలాంటి ఘటనలు మహిళల రక్షణను రోజురోజుకీ ప్రశ్నార్థకంగా మార్చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇలా అత్యాచారాలకు పాల్పడిన కామాంధులకు కోర్టులు కూడా కఠినమైన శిక్షలు వేస్తూ ఉండడం గమనార్హం. అయితే ఇక్కడ కోర్టులో అత్యాచారం కి సంబంధించి ఒక కేసు నమోదు అయితే.. కేసు పై విచారణ జరిపిన కోర్టు పురుషుడికి కాదు మహిళకు జైలు శిక్ష విధించింది.


 అదేంటి అత్యాచారం జరిగిన కేసులో పురుషులకు కదా శిక్ష పడేది. ఇక్కడ మహిళకు శిక్ష విధించడం ఏంటి అనుకుంటున్నారు కదా. ఆమె అత్యాచారం చేశాడు అంటూ తప్పుడు కేసు పెట్టింది. దీంతో ఈ ఘటనపై విచారణ జరిపిన కోర్టు మహిళకు 5.88 లక్షల జరిమానాతో పాటు నాలుగేళ్ల జైలు శిక్ష కూడా విధించింది. అయితే తనపై కూడా అత్యాచారం చేశాడు అంటూ ఆ మహిళ కూతురు కూడా ఫిర్యాదు చేయగా.. నిందితుడు నాలుగేళ్లు జైలు శిక్షణ అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఇటీవల తన వాంగ్మూలం తప్పు అంటూ ఆ మహిళ కూతురు ఒప్పుకోవడంతో చివరికి మహిళకు జైలు శిక్ష విధించింది కోర్టు.

మరింత సమాచారం తెలుసుకోండి: