•శ్రీకాకుళం, విజయనగరంలో టఫ్ ఫైట్
•శ్రీకాకుళంలో కొనసాగుతున్న టీడీపీ హవా
•విజయనగరంలో దూసుకుపోతున్న వైసీపీ



ఉత్తరాంధ్ర (శ్రీకాకుళం, విజయనగరం) - ఇండియా హెరాల్డ్: ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం అనేది కీలకమైన నియోజకవర్గం. అలాగే టఫ్ ఫైట్‌ నడుస్తున్న పార్లమెంట్ నియోజకవర్గం కూడా. ఇక్కడ టీడీపీ నుంచి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు ఇంకా వైసీపీ నుంచి పేరాడ తిలక్‌ పోటీ చేస్తున్నారు.ఎర్రన్నాయుడు లెగసీ ఇంకా అలాగే అతని సొంత ఇమేజ్‌ రామ్మోహన్‌ నాయుడికి కలిసొచ్చే అంశం. వైసీపీ అభ్యర్థి పేరాడ తిలక్‌ కాళింగ సామాజికవర్గం కావడం సానుకూల అంశంగా మారింది.ఈ మెజార్టీ అసెంబ్లీ సెగ్మెంట్లలో 3 లక్షల దాకా కాళింగ ఓటర్లే ఉన్నారు. అలాగే గతంలో రెండుసార్లు ఓడిపోయారన్న సానుభూతి తిలక్‌పై ఉంది. ఇక రాజకీయంగా బాగా యాక్టివ్‌గా ఉండే రామ్మోహన్‌ నాయుడిని తిలక్‌ ఢీ కొట్టలేరనే టాక్ కూడా ఉంది.ఈ ఈక్వేషన్స్‌ అన్నీ కూడా పరిశీలిస్తే రామ్మోహన్‌ నాయుడికి ఎడ్జ్‌ స్పష్టంగా ఉందని ఇండియా హెరాల్డ్ చేసిన సర్వేలో తెలిసింది.


ఇక మరో కీలక నియోజకవర్గం విజయనగరం విషయానికి వస్తే పార్లమెంట్‌ సీటులో వైసీపీ నుంచి సిట్టింగ్‌ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ మరోసారి పోటీ చేస్తున్నారు. తెలుగు దేశం పార్టీ నుంచి కలిశెట్టి అప్పలనాయుడు పాతికేళ్ల నుంచి పార్టీలో ఉన్నా కానీ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగారు.ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జ్‌గా పార్టీ కార్యకర్తలకు ట్రైనింగ్‌ ఇవ్వడం జరిగింది. అదే ఈ ఎన్నికల్లో ఈయనకు ప్లస్‌ పాయింట్ అయ్యింది. కానీ  స్థానికేతరుడు కావడం మాత్రం అప్పలనాయుడుకి మైనస్‌.అయితే మంత్రి బొత్స ప్రభావం, చంద్రశేఖర్‌ వ్యక్తిగత ఇమేజ్‌.. ఈ అంశాలు వైసీపీకి ప్లస్‌ గా మారాయి.పార్లమెంట్‌ పరిధిలోని చీపురుపల్లిలో గట్టి పట్టు ఉంది.


విజయనగరం పార్లమెంట్‌ పరిధిలో విజయనగరం, బొబ్బిలి, గజపతినగరం, చీపురుపల్లి, నెల్లిమర్ల, ఎచ్చర్ల ఇంకా రాజాం అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ ఏడింటిలో ఐదు చోట్ల చంద్రశేఖర్‌కు బంధుగణం బాగానే ఉంది. గెలుపు కోసం స్థానికంగా ఆయన బంధువులు చాలా కష్టపడుతున్నారు.ఇక 4 అసెంబ్లీ సెగ్మెంట్లలో బొత్సకు గట్టి పట్టు ఉండటం వైసీపీకి బిగ్ ప్లస్‌. ఎంపీ నిధులతో చేసిన డెవలప్మెంట్ కూడా కలిసి వస్తుందని చంద్రశేఖర్‌ అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ సీటులో తెలుగుదేశం పార్టీకి పడే ఓట్లలో కొంత వరకు ఎంపీ ఎన్నికలో వైసీపీకి క్రాస్‌ ఓటింగ్‌ జరిగే ఛాన్స్ కూడా ఉంది. అందుకే విజయనగరం పార్లమెంట్‌ పరిధిలో మరోసారి వైసీపీకి గెలిచే ఛాన్స్ ఉన్నట్టు ఇండియా హెరాల్డ్ చేసిన సర్వేలో తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: