ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా పార్లమెంట్ ఎన్నికల హడావిడి కనిపిస్తుంది. ఇక మే 13వ తేదీన పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఉన్న కొంత సమయాన్ని కూడా ఓటర్లను ఆకట్టుకునేందుకు వాడుకుంటున్నాయి అన్ని పార్టీలు. ఈ క్రమంలోనే హామీల వర్షం కురిపిస్తూ ఇక ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి అని చెప్పాలి.


 అసెంబ్లీ ఎన్నికల్లో లాగానే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సత్తా చాటుతామని కాంగ్రెస్ చెబుతుంటే.. అసెంబ్లీ ఎన్నికల్లో కాస్త తక్కువ స్థానాల్లో విజయం సాధించి ప్రతిపక్షంతో సరిపెట్టుకున్న పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ మాకే వస్తుంది అంటూ బిఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తుంది. మోడీ మేనియాతో అటు తెలంగాణలో సత్తా చాటుతామని.. బిజెపి నేతలందరూ కూడా చెబుతున్నారు. అయితే ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన బిఆర్ఎస్ పార్టీ ఇక ఇప్పుడు సిట్టింగ్ స్థానాలను కాపాడుకోగలద లేదా అనే విషయంపై కూడా చర్చ జరుగుతుంది.


 ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీకి సిట్టింగ్ స్థానంగా కొనసాగుతుంది చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం. అయితే 2014లో ఇక్కడి నుంచి బిఆర్ఎస్ తరఫున కొండా విశ్వేశ్వర్ రెడ్డి పోటీ చేసి గెలిచారు. ఇక 2019లో రంజిత్ రెడ్డి గులాబీ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. వరుసగా రెండుసార్లు విజయం సాధించిన బీఆర్ఎస్ ఇక ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టాలని అనుకుంటుంది. అయితే 2019లో బిఆర్ఎస్ నుంచి గెలిచిన రంజిత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుండగా 2014లో గులాబీ పార్టీ నుంచి గెలిచిన కొండ విశ్వేశ్వర్ రెడ్డి ఇక ఇప్పుడు బిజెపి నుంచి బరిలో దిగారు. ఇక బిఆర్ఎస్ పార్టీ నుంచి సీనియర్ రాజకీయ నేత బీసీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ బరిలోకి దిగారు. కాగా గతంలో బిఆర్ఎస్ నుంచి గెలిచి ఇతర పార్టీలోకి వెళ్లిన నేతలకు ఇక ఆ పార్లమెంట్ సెగ్మెంట్లో మంచి పట్టు ఉన్నప్పటికీ.. ఇక బిసినేత కాసాని జ్ఞానేశ్వర్ కు అపరమైన రాజకీయ అనుభవం ఉండడం.. ఇక సేవ కార్యక్రమాలతో మంచి గుర్తింపు సంపాదించుకోవడంతో తప్పక ఆయన విజయం సాధిస్తారని గులాబీ పార్టీ బలంగా నమ్ముతుంది ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Kcr