ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూరు జిల్లా చాలా కీలకమైనది. ఈ జిల్లాలో  ఓటర్లు చాలా అప్డేట్ గా ఉంటారు. వీరు ఏ వైపుగా ఓటు వేస్తే ఆ పార్టీ తప్పనిసరిగా రాష్ట్రంలో విజయం సాధిస్తుంది.  అలాంటి చిత్తూరు పార్లమెంటు పరిధిలో మొత్తం ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో కుప్పం, గంగాధర నెల్లూరు, చిత్తూరు, చంద్రగిరి, నగరి, పలమనేరు, పూతలపట్టు. ఈ ఏడు నియోజకవర్గాల్లో  చిత్తూరు పార్లమెంటు స్థానంలో ఎవరు విజయం సాధిస్తున్నారు.. వారి బలాబలాలు ఏంటి అనేది  తెలుసుకుందాం. చిత్తూరు పార్లమెంటు విషయానికి వస్తే  టిడిపి అభ్యర్థిగా దగ్గుమల్ల ప్రసాదరావు పోటీ చేస్తున్నారు. ఇక వైసిపి విషయానికి వస్తే..రెడ్డప్ప పోటీ చేస్తున్నారు.  ఇందులో దగ్గుమల్ల ప్రసాదరావు మాజీ ఐఆర్ఎస్ అధికారి. వ్యాపారం చేయడంలో కూడా అగ్రగన్యుడు. ఎలాంటి  అవినీతి ఆరోపణలు లేని క్లీన్ నాయకుడు.  ఈయన  పార్లమెంటు స్థానం మొత్తం పక్కా ప్లాన్ చేసుకొని ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అంతేకాకుండా ఈసారి టిడిపి, బీజేపీ,జనసేన  పొత్తులో ఉంది కాబట్టి  ఈ మూడు పార్టీల ఓట్లు ఈయన వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇక ఈయన మైనస్ విషయానికి వస్తే..  లోకల్ కాకపోవడం కాస్త మైనస్ అని చెప్పవచ్చు. ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ వైసీపీ అభ్యర్థి ఎం రెడ్డప్ప విషయానికి వస్తే  లోకంలో మంచి పట్టు ఉంది. కానీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు కాబట్టి  ఏమీ అభివృద్ధి చేయలేదనే ఒక విమర్శ కూడా ఉంది. కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ టిడిపికి వెళ్లే అవకాశం కనిపిస్తోంది.

 కుప్పం:
చంద్రబాబుVs భరత్
 కుప్పం నియోజకవర్గం టిడిపికి కంచుకోట. చిత్తూరు పార్లమెంటు పరిధిలో మొత్తం ఇతర పార్టీలు గెలిచినా కుప్పంలో మాత్రం టిడిపి జెండా ఎగురుతుంది. ఈ విధంగా కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు ఏకపక్ష విజయాన్ని సాధిస్తారు. ఎందుకంటే ఆయన ఈ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. అంతేకాకుండా కుప్పం నుంచి గెలిస్తే ఆయన ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి అక్కడి ప్రజలు  వన్ సైడ్ గా చంద్రబాబుకే ఓటు వేస్తూ ఉన్నారు. కానీ ఈసారి కుప్పం నుంచి కూడా చంద్రబాబుకు గట్టి పోటీ ఏర్పడింది. వైసీపీ నుంచి భరత్ అనే వ్యక్తిని బరిలోదించింది. అంతేకాదు కుప్పంలో భరత్ గెలిస్తే మంత్రి పదవి ఇస్తానని జగన్ ఇప్పటికే ప్రకటించారు.  విధంగా చంద్రబాబు గెలిస్తే ముఖ్యమంత్రి భరత్ గెలిస్తే మంత్రి అనే నినాదంతో కుప్పంలో పోటీ హోరాహోరీగా సాగుతోంది. ఏది ఏమైనా కుప్పం మాత్రం  తప్పక టిడిపి ఖాతాలో పడుతుంది.
 జీడి నెల్లూరు:
 కృపా లక్ష్మిVs థామస్
 చిత్తూరు జిల్లాలో మరో ఆసక్తికరమైన నియోజకవర్గం జీడి నెల్లూరు. ఈ నియోజకవర్గంలో వైయస్సార్ పార్టీ నుంచి కృపా లక్ష్మీ బరిలో ఉండగా టిడిపి నుంచి డాక్టర్ వి.ఎం థామస్ బరిలో ఉన్నారు.  వీరి బలాబలాల విషయానికొస్తే కృపా లక్ష్మీనారాయణ స్వామి కూతురు. అయితే వైసిపి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నారాయణస్వామి మీద వ్యతిరేకత రావడంతో  కూతురుకు సీట్ ఇచ్చింది వైసిపి. అంతేకాకుండా ఇందులో వర్గ పోరు కూడా ఏర్పడింది. ఈ తరుణంలోనే టిడిపి నుంచి ఆర్థికంగా బలమైన అభ్యర్థి  థామస్ ను బరిలో ఉంచింది. దీంతో ఈ నియోజకవర్గం టిడిపి కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది.

 
 పూతలపట్టు:
 సునీల్ కుమార్Vs మురళీమోహన్ :
 పూతలపట్టులో వైసీపీ నుంచి సునీల్ కుమార్ టిడిపి నుంచి మురళీమోహన్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఇద్దరి మధ్య హోరాహోరీ పోటీ ఉంది. కానీ వైసీపీ అభ్యర్థి  కొద్దిపాటిగా ముందున్నారని అక్కడి ప్రజలు టాక్.
 నగరి:
 రోజాVs భాను ప్రసాద్:
 ఇక నగరి నియోజకవర్గ పేరు చెప్పగానే మంత్రి రోజా పేరు వినపడుతుంది. కానీ ఈసారి రోజాకు చాలా వ్యతిరేకత వస్తుందట. అక్కడ తన బ్రదర్స్ అవినీతి ఆరోపణలో ముందున్నారని వైసీపీ నాయకులను బెదిరింపులకు గురి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల ఈసారి గాలి భాను ప్రకాష్ కాస్త ముందంజలో ఉన్నారని అంటున్నారు.
 చిత్తూరు:
 విజయ నందారెడ్డిVs జగన్మోహన్
 చిత్తూరు విషయానికి వస్తే..  ఇద్దరు అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు జరుగుతుంది. ఇక్కడ బలిజ కమ్యూనిటీ ఓట్లను డిసైడ్ చేస్తారు. రెడ్డిస్ కాస్త కీలకంగానే, కమ్మ తక్కువ బీసీ, ఎస్సీలు ఎక్కువగా ఉంటారు. ఇక్కడ టిడిపి కాస్త ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది.
 పలమనేరు:
 వెంకటేష్ గౌడVs అమర్నాథ్ రెడ్డి
 ఇక పలమనేరు విషయానికి వస్తే..  ఇక్కడ టిడిపికే మంచి పట్టు ఉంది. ఇక్కడ టిడిపికే అనుకూలంగా  ఓట్లు పడే అవకాశం కనిపిస్తోంది.
 చంద్రగిరి:
 చెవిరెడ్డి మోహిత్ రెడ్డి Vs నాని
 చంద్రగిరి నియోజకవర్గం విషయానికి వస్తే .. ఈసారి ఇక్కడ వైసీపీకే కాస్త కలిసివచ్చే అవకాశం కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: