•రాయలసీమ దెబ్బకు కూటమి విలవిల

•వైసీపీ జెండా ఎగరడం ఖాయమేనా

•ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో గెలుపు ఆ పార్టీదే


(రాయలసీమ - ఇండియా హెరాల్డ్)

ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు కేవలం ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా రాయలసీమ అనంతపురం అసెంబ్లీ స్థానాల్లో పోటీ పడుతున్న ఏడు నియోజకవర్గాలలో  నువ్వా నేనా అంటూ అభ్యర్థులు పోటీపడుతున్నారు.. మరి రాయలసీమ దెబ్బకు అటు ప్రతిపక్ష పార్టీ కూటమి ఇటు వైసీపీ ఉత్కంఠగా పోటీ పడుతున్నారు.. మరి సీమ దెబ్బకు ఎవరు తట్టుకుంటారు..? ఎవరు కొట్టుకుపోతారు? అనే విషయం చిన్న విశ్లేషణ ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం..

అనంతపురం అర్బన్:

టిడిపి తరఫున దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్,  వైసీపీ తరఫున అనంత వెంకట రామిరెడ్డి పోటీ పడుతున్నారు.. ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా అనంత వెంకట్రాంరెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తారని స్థానికంగా వార్తలు వినిపిస్తున్నాయి.

గుంతకల్లు:

టిడిపి తరఫున గుమ్మనూరు జయరాం పోటీ పడుతుండగా , వైసిపి నుంచి మల్లారెడ్డి గారి వెంకటరామిరెడ్డి పోటీ పడుతున్నారు.. ఇక్కడ స్థానిక బలాలు ఎలా ఉన్నా సరే అనంత వెంకట్రామిరెడ్డి మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రాప్తాడు:

టిడిపి తరఫున పరిటాల సునీత అభ్యర్థిగా పోటీ చేస్తుండగా.. వైఎస్ఆర్సిపి తరఫున తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పోటీ పడుతున్నారు.. ఇక్కడ గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి పరిటాల సునీత గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి.

శింగనమల:

వైసిపి పార్టీ నుంచి మన్నేపాకుల వీరాంజనేయులు పోటీ పడుతుండగా.. టిడిపి నుంచి బండారు శ్రావణి పోటీ పడుతుంది.. ఇక ఇక్కడ ఈమెకు ప్రజల సానుభూతి ఎక్కువగా నేపథ్యంలో బండారు శ్రావణి గెలుపొందే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

తాడిపత్రి:

వైసిపి తరఫున కేతిరెడ్డి పెద్దారెడ్డి పోటీ చేస్తుండగా, టిడిపి తరఫున జేసీ అస్మిత్ రెడ్డి పోటీ పడుతున్నారు.. అయితే ఈసారి ఇక్కడ ఉత్కంఠ భరితంగా పోటీ జరగబోతున్న నేపథ్యంలో ఎవరు గెలుస్తారు అన్న విషయం ఇంకా స్పష్టత రాలేదు.. కానీ చాలామంది ప్రజలు కేతిరెడ్డి పెద్దారెడ్డి వైపు ముగ్గు చూపుతున్నట్లు సమాచారం.

కళ్యాణ్ దుర్గం:

వైసిపి తరఫున తలారి రంగయ్య పోటీ పడుతుండగా టిడిపి నుంచి సురేందర్ బాబు పోటీ చేస్తున్నారు.. స్థానికంగా సురేందర్ బాబుకు బలం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈయనకే ఓట్లు మెజారిటీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రాయదుర్గం:

వైసీపీ తరఫున మెట్ట గోవింద్ రెడ్డి టిడిపి తరఫున కాల్వ శ్రీనివాసులు పోటీ పడుతున్నారు.. ఇద్దరూ కూడా బడానేతలే.. ఇక్కడ ఎలక్షన్ల పోరు మరింత రసవత్తరంగా సాగుతోంది. ఇక ఈ నువ్వా నేనా పోరులో ఎవరు గెలుస్తారు అన్నది స్పష్టత లేకపోవడం గమనార్హం. అయితే మెట్ట గోవిందరెడ్డికి అవకాశాలు కనిపిస్తున్నాయి.

అనంతపురం పార్లమెంటులో 7 నియోజకవర్గాలు ఉండగా.. ఈ అసెంబ్లీ స్థానాలలో 3 సీట్లు టిడిపికి, 4 సీట్లు వైసిపికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఇక బలాబలాలను బట్టి చూస్తే వైసిపి పార్టీ రాయలసీమ దెబ్బకు గట్టి పోటీ ఇస్తుందనటంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: