ఒకప్పుడు దాసరి నారాయణరావు శిష్యులు కోడి రామకృష్ణ ముత్యాల సుబ్బయ్య లాంటి ఎందరో కొంతకాలం ఇండస్ట్రీలో పాపులర్ డైరెక్టర్లుగా ఒక వెలుగు వెలిగి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తీసిన సందర్భాలు ఉన్నాయి. ఆతరువాత ఎందరో స్టార్ డైరెక్టర్స్ ఇండస్ట్రీని షేక్ చేసినప్పటికీ వారి శిష్యులు ఎవరు ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న సందర్భాలు లేవు.



అయితే దీనికి భిన్నంగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ శిష్యులు ఇండస్ట్రీలో మంచిమంచి సినిమాలు తీసి తమకు గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా తమ గురువు సుకుమార్ ను కూడ మంచి పేరును తీసుకురావడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ‘కుమారి 21 ఎఫ్’ తో ఒక్కసారి వెలుగులోకి వచ్చిన దర్శకుడు సూర్య ప్రకాష్ ఇండస్ట్రీలో తన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.



‘ఉప్పెన’ మూవీతో ఒక్కసారి విపరీతంగా వెలుగులోకి వచ్చిన దర్శకుడు బుచ్చిబాబు ఇప్పుడు ఏకంగా రామ్ చరణ్ తో ఒక పాన్ ఇండియా మూవీని భారీ స్థాయిలో తీస్తున్న విషయం తెలిసిందే. అదేవిధంగా ‘విరూపాక్ష’ మూవీతో లాంచ్ అయిన కార్తీక దండు ఇప్పుడు ఏకంగా నాగచైతన్యతో సినిమాను తీస్తున్నాడు. నానితో తీసిన ‘దసరా’ మూవీ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కూడ తాను సుకుమార్ శిష్యుడు ని అని చెప్పుకుంటున్నాడు.



లేటెస్ట్ గా విడుదలైన ‘ప్రసన్నవదనం’ మూవీతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు అర్జున్ పై కూడ మంచి ప్రశంసలు వస్తున్నాయి. ఇతడు కూడ గతంలో సుకుమార్ దగ్గర సహాయ దర్శకుడుగా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలా సుకుమార్ దగ్గర పనిచేసిన చాలమంది సహాయ దర్శకులు ఆతరువాత రోజులలో పాపులర్ డైరెక్టర్స్ గా మారిపోతూ ఉండటంతో లెక్కలు మాష్టర్ అయిన సుకుమార్ తన దగ్గర పనిచేసే సహాయ దర్శకులకు మంచిగా పాఠాలు చెపుతున్నాడు అనుకోవాలి. అయితే సుకుమార్ రేంజ్ కన్నా చాల ముందు వరసలో ఉన్న రాజమౌళి శిష్యులు మాత్రం పాపులర్ దర్శకులుగా ఎందుకనో రాణించలేకపోతున్నారు..  




 


మరింత సమాచారం తెలుసుకోండి: