టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత క్రికెట్లో తిరుగులేని ప్లేయర్గా ప్రస్తానాన్ని కొనసాగించిన మహేంద్ర సింగ్ ధోని ఏకంగా టీమ్ ఇండియాకు రెండు వరల్డ్ కప్ లు అందించి భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన పేజీలు లికించుకున్నాడు అని చెప్పాలి. అయితే 2019లో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ అభిమానుల కోసం ఇంకా ఐపీఎల్లో కొనసాగుతూనే ఉన్నాడు. గత ఐపిఎల్ సీజన్ వరకు కూడా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా అలరించాడు ధోని.


 అయితే 2024 ఐపీఎల్ సీజన్లో మాత్రం కెప్టెన్సీ నుంచి తప్పుకున్న మహేంద్ర సింగ్ ధోని ఋతురాజ్ చేతికి సారధ్య బాధ్యతలను అప్పగించాడు. ఇక ఇప్పుడు చెన్నై జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతున్నాడు. కాగా ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. ఇక మహేంద్రడు ఎక్కడ మ్యాచ్ ఆడిన కూడా అటు ప్రేక్షకులు భారీగా తరలివస్తూ ఉన్నారు. ధోని కూడా మెరుపు ఇన్నింగ్స్ లతో అభిమానులు అందరినీ కూడా ఆకట్టుకుంటున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం 42 ఏళ్ల వయసులో కూడా మహేంద్రసింగ్ ధోని అటు మైదానంలో వికెట్ల వెనకాల కీపింగ్ చేస్తూ చిరుత పులిలా కదులుతూ ఉంటాడు.


 ఒక్క క్యాచ్ కూడా నేలపాలు చేయకుండా అదరగొడుతూ ఉంటాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల సిఎస్కే మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో 150 క్యాచ్లు అందుకున్న ఏకైక ఆటగాడుగా నిలిచాడు. ఇందులో వికెట్ కీపర్ గా 146 ఫీల్డర్ గా నాలుగు క్యాచ్ లు అందుకున్నారు. అయితే ధోని తర్వాత స్థానంలో ఆర్సిబి ఫినిషర్ దినేష్ కార్తీక్ 144 క్యాచ్ లతో తర్వాత స్థానంలో ఉండడం గమనార్హం. తర్వాత ఏబి దివిలియర్స్ 118, విరాట్ కోహ్లీ 113, సురేష్ రైనా 109 క్యాచ్ లతో ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక క్యాచ్ లు అందుకున్న ప్లేయర్గా టాప్ ఫైవ్ లో ఉన్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: