పొగాకు వల్ల నేడు ఎన్నో అనారోగ్యాలు కలుగుతున్నాయి, సిగరెట్‌ తాగడం వల్ల గుండె, ఊపిరతిత్తులకు సంబంధించిన వ్యాధులతో పాటు క్యాన్సర్‌, డయాబెటిస్‌ వంటి వ్యాధులు వస్తున్నాయి. ఆస్తమా రావడానికి సిగరెట్‌ తాగడం కూడా ఓ కారణమే. పొగ వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 సెకండ్లకు ఒక వ్యక్తి మరణిస్తే ప్రతి ఏడాది మిలియన్‌ మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో పాటు పొగాకుతో కూడిన గుట్కా కూడా మనిషికి ప్రాణాంతకంగా మారుతోంది.

 ఈ నేపథ్యంలో పొగాకు మూలంగా సంభవించే వ్యాధులపట్ల చైతన్యం కలిగించేందుకు ప్రతి ఏటా మే 31న 'వరల్డ్‌ నో టొబాకో డే'ను పురప్కరించుకొని, హైదరాబాద్‌లోని డా.రావూస్‌ ఓరల్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మే 1నుండి 31 వరకు నెల రోజుల పాటు పొగాకు వ్యతిరేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతీ పౌరుడికి స్మోకింగ్‌ వలన వచ్చే అనారోగ్య సమస్యలను తెలియజెప్పడమే ఈ కార్యక్రమం లక్ష్యం. తెలంగాణా వ్యాప్తంగా ర్యాళీలు , సభలు , సమావేశాలు జరిపి పొగాకు వలన జరిగే నస్టాలను ప్రజలకు తెలియజేస్తామని డా.రావూస్‌ ఓరల్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ వ్యవస్ధాపకులు దంతవైద్యులు డా.ఓ.నాగేశ్వరరావు అంటున్నారు. 

పొగ త్రాగడం నేడు ఫ్యాషన్‌ అయిపోయింది. ఎవరింట్లోనైతే పెద్దలు సిగరెట్‌ తాగుతారో ఆ ఇంట్లోని పిల్లల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. పొగ తాగే వారికన్నా ఆ వ్యక్తి చుట్టుపక్కలనున్న వ్యక్తి ఆరోగ్యంపై పొగ ప్రభావం అధికంగా ఉంటుందంటున్నారు , డా.ఓ.నాగేశ్వరరావు. పొగతాగే అలవాటు రక రకాలుగా ప్రజలలోకి చొచ్చుకుపోయినది. యువత సిగరెట్లగాను , గిరిజన ప్రాంతాల్లో చుట్టులు గా , పేదలు బీడీలుగా దీనిని సేవిస్తున్నారు . దీనికి తోడుగా '' ఖైనీలు , గుట్కాలు, జర్దాలు, '' వంటి పేర్ల తో పొగాకు ఉత్పత్తులు లభిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతం లో వీటి వినియోగం ఎక్కువగా ఉంటున్నాయి . గ్రామీణ మహిళలు అడ్డచుట్ట కాలుస్తారు. ఇది నోటి కాన్సర్‌ కు దారితీస్తుంది . పొగ ''క్షయ'' వ్యాది కి కారణమవుతుంది అంటారు డాక్టర్‌ నాగేశ్వరరావు. 

యువకుల నుంచి పెద్దల వరకు సిగరెట్‌, బీడీలు ఊదిపారేస్తూ జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. ఆరోగ్యాలను పాడుచేసుకుంటున్నారు. ముందు సరదాగా మొదలై వ్యసనంగా మారుతోంది. పొగను రింగులు రింగులుగా వదులుతూ, విలాసంగా సిగరెట్‌ కాలుస్తున్నాననుకుంటూ జీవితాన్ని చేజేతులా కాల్చుకోవద్దని డాక్డర్‌ కోరుతున్నారు. ( పొగతాగడం మానాలనుకునే వారు డాక్టర్‌ నాగేశ్శరరావుగారికి 9849014562 ఫోన్‌ చేసి సలహాలు,కౌన్సిలింగ్‌ పొందవచ్చు. )


మరింత సమాచారం తెలుసుకోండి: