కరోనా మహమ్మారి నుండి రక్షించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసుకుంటాం. అందులో భాగంగానే రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. కరోనా వైరస్ చాలా వేగంగా సోకుతుంది. ఇది రాకుండా ఉండడానికి జాగ్రత్త తీసుకోవడం మనకు మార్గం. వైరస్ సోకిన దాన్ని అడ్డుకోవడానికి మన శరీరంలో రోగనిరోధక శక్తి ఉండాలి. శరీరం బలహీనంగా ఉంటే వైరస్ తొందరగా సోకుతుంది. కాబట్టి రోగనిరోధకశక్తి పెంచుకోవడానికి మనం తినే ఆహారం లో పోషకాలు ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి.

ఇంకా యోగ, వ్యాయామం చేస్తూ శరీరం ఫిట్గా ఉండేందుకు ప్రయత్నించాలి. మనం ఆరోగ్యంగా ఉంటే వ్యాధులు, వైరసులు తనకి తొందరగా సోకవు. ఎందుకు ఆహార నియమాలు, జీవనశైలిలో అలవాట్లు మార్పు చేసుకుంటే వైరస్ వల్ల బయట పడే అవకాశం ఉంది. మన మార్చుకోవాల్సిన ఆహారపు అలవాట్లు గురించి తెలుసుకుందాం..

 తీసుకొనే ఆహారంలో విటమిన్ ఎ, బి, సి, డి, ఈ, ఉండేటట్లు చూసుకోవాలి. వీటితో పాటు ఫ్యాటి ఆసిడ్, అమైనో, ఫైట్ న్యూట్రియేంట్లు కూడా ఉండాలి. ఇవి తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.వైరస్ వల్ల కలిగే శ్వాస సమస్యలు ఎదుర్కోవాలంటే, విటమిన్ ఎ చాలా అవసరం. యాంటీ ఆక్సిడెంట్లుగా పోషకాలు పనిచేస్తాయి. వీటివల్ల వైరస్ తో పోరాడుతాయి. సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.

 ఫాస్ట్ ఫుడ్కు దూరంగా ఉండండి. ఎందుకంటే రోగ నిరోధక శక్తి తగ్గిపోవడానికి ఫాస్ట్ ఫుడ్ కారణం కాబట్టి కూరగాయలు,  మాంసం,గుడ్లు,  తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.  తృణధాన్యాలు,పాల ఉత్పత్తులు తీసుకోవడం వల్ల కూడా ఇమ్యూనిటీ పెరుగుతుంది.

 పండ్లు తినడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే పండ్లలో సహజమైన పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి మంచి చేస్తాయి. ఏ పండ్లు తినాలి అని సందేహ పడుతుంటారు. కానీ అన్ని పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. విటమిన్ సి ఉండే నిమ్మ. నా రాంజీ, బత్తాయి రోజు తీసుకోవాలి.  ఆపిల్,దానిమ్మ, ద్రాక్ష జామ పండ్లలో పొటాషియమ్ ఉంటుంది. ఇంకా విటమిన్ బి, సి లు ఎక్కువగా ఉంటాయి.

 కరోనా వస్తుందేమో అని భయంతో మాంసము గుడ్లు తినకూడదు ఏమో అనుకుంటూ ఉంటారు.కానీ మాంసము,గుడ్లు తెచ్చిన తరువాత వాటిని శుభ్రంగా కడిగి, బాగా ఉడికించాలి. తర్వాత తినడం చాలా మంచిది ఎందుకంటే ఉష్ణోగ్రత దగ్గర ఉడికించడం వల్ల వైరస్ బతికే చాన్సు తక్కువ అని పరిశోధకులు చెబుతున్నారు. మాంసాన్ని ఎక్కువగా తినకూడదు

 కూల్ ఎక్కువగా ఉన్న నీరు తాగ కూడదు. కూల్ డ్రింక్స్ తీసుకోకూడదు. ఎందుకంటే వీటిలో ఉప్పు, చక్కెర ఉంటాయి.  ఇవి శరీరానికి మంచిది కాదు.రోగ నిరోధక శక్తి పెరగకుండా చేస్తాయి.  ఇంట్లో తయారు చేసుకొని తినే ఆహారం చాలా మంచిది. బయటనుండి తెచ్చే ఆహారాన్ని చాలావరకు తగ్గించుకోవాలి.

 చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ధూమపానం, మద్యపానం వ్యక్తి దూరంగా ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.మద్యం ధూమపానం అలవాటు ఉండేవాళ్ళకి రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్నదని వైద్య నిపుణులు చెబుతున్నారు. స్మోకింగ్ అలవాటు ఉన్న వారి ఊపిరితిత్తులు బలహీనంగా తయారవుతాయి వీటివల్ల వైరస్ తొందరగా సోకుతుంది. అందువల్ల చెడు వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది.

 ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం, యోగ చేయడం చాలా మంచిది. నిరోధక శక్తి వైరస్ కోసమే కాదు ఆరోగ్యంగా ఉండటానికి కూడా సహాయపడుతుంది. మానసిక, శారీరిక ఆరోగ్యాన్ని పొందాలంటే యోగా చేయాలి. అలాగే నిద్ర కూడా చాలా ముఖ్యం రోజుకి 7 లేదా 8 గంటలు నిద్ర పోవాలి. నిద్ర తక్కువైనా ఆరోగ్యాలు వస్తాయి. బయటకు పోయి వచ్చిన తర్వాత శుభ్రంగా స్నానం చేసి, లేదా చేతులు శుభ్రంగా కడుక్కొని తర్వాత పనులు చూసుకోవాలి. ఈ రోజు అలవాటు చేసుకుంటే, వైరస్ కాకుండా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: