నొప్పిగా ఉన్న చోట వేడిచేసిన ఆవాల నూనె, కొబ్బరి నూనెలతో మసాజ్ చేయడం వల్ల నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.
పలచని వస్త్రం తీసుకొని, అందులోకి ఐస్ ముక్కలు వేసుకొని మెడ నొప్పి ఉన్న చోట పెట్టడం వల్ల నొప్పి తగ్గుతుంది.
మెడ నొప్పి వచ్చినప్పుడు వేడినీటితో కాపడం పెట్టడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే కండరాలు బిగుసుకుపోయి ఉంటాయి.కాబట్టి విశ్రాంతి తీసుకుంటే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది
యాపిల్ సైడర్ వెనిగర్ ను వేడి నీటిలో వేసి కాటన్ గుడ్డ తీసుకొని నీటిలో ముంచి నొప్పి ఉన్న చోట పెట్టుకోవడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
నొప్పి ఎక్కువగా ఉన్న చోట లావెండర్ నూనెను అప్లై చేసి బాగా మసాజ్ చేయాలి. ఇలా పదినిమిషాల పాటు చేయడం వల్ల మెడ నొప్పి తగ్గుతుంది.
ఒక గ్లాసు వేడి పాలలో ఒక స్పూన్ పసుపు వేసి తాగడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఎందుకంటే పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి నొప్పితగ్గడానికి ఉపయోగపడతాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి