
చాలా మందికి జుట్టు తెల్లబడుతుంటుంది. ఇలాంటి సమయంలో రంగులు వేయకుండా గోరింటాకుతో హెన్నా పెట్టడం చాలా మంచిది. హెన్నా పెట్టడం వల్ల జుట్టు బలంగా పెరుగుతోందని, అలాగే ఒత్తుగా పెరగడానికి దోహద పడుతుంది. ఇంకా నిగనిగలాడుతూ ఉంటుంది. కంటికి, ఒంటికి చలవ చేయడానికి హెన్నా దోహదపడుతుంది . జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి, మెరుస్తూ ఉండడానికి గోరింటాకు బాగా ఉపయోగపడుతుంది. గోరింటాకు ఎలా ఉపయోగపడుతుందో? ఎలా వాడాలి? వాటి గురించి వివరంగా తెలుసుకుందాం..
హెన్నా జుట్టుకు కండిషనర్ గా పనిచేస్తుంది. ప్రతి వెంట్రుక కుదురును తాకి జుట్టు మొదల్లో పాడవకుండా రక్షణ కవచంలా పనిచేస్తుంది. హెన్నాను క్రమం తప్పకుండా వాడుతున్నట్లయితే జుట్టు ఒత్తుగా పెరగడానికి కాకుండా, తేమగా ఉండేటట్లు చేస్తుంది. అలాగే జుట్టు దృఢంగా ఉండేటట్లు చేస్తుంది. అంతేకాకుండా హెన్నా వేసుకోవడం వల్ల జుట్టుకు సహజమైన నిగారింపు వస్తుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
చుండ్రు సమస్యను తొలగించడానికి హెన్నా బాగా ఉపయోగపడుతుంది. అలాగే రెండు టేబుల్ స్పూన్ల మెంతి గింజలు తీసుకొని వాటిని రాత్రంతా నీళ్ళలో నానబెట్టి ఉదయాన్నే మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పేస్టుని వెంట్రుకలకు అప్లై చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా ఈ మిశ్రమానికి కొద్దిగా ఆముదం కలిపి, కొద్దిగా గోరింటాకు కలిపి, బాగా వేడి చేయాలి. చల్లారిన తర్వాత దాన్ని జుట్టుకు బాగా పట్టించి ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా చుండ్రు సమస్య తగ్గుతుంది.
ఎండబెట్టిన ఉసిరికాయను రెండు టేబుల్ స్పూన్లు తీసుకొని, అందులో కొన్ని నీళ్ళు పోసి బాగా మరగబెట్టాలి. అలాగే అందులోకి 1 స్పూన్ బ్లాక్ టీ కూడా వేయండి. ఇంకా రెండు లవంగాలను కూడా వేయండి. అందులోకి కొద్దిగా హెన్నా వేసి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి రాత్రంతా అలానే ఉంచాలి. ఇలా చేయడం వల్ల తెల్ల జుట్టు నల్ల బడడం కాకుండా, జుట్టు నిగారింపుగా ఉంటుంది.
తెల్ల జుట్టు ఉందని బాధ పడుతున్న వాళ్ళు రసాయనాలతో కూడిన రంగులు వేయకుండా తలకు గోరింటాకు పెట్టుకోవడం వల్ల జుట్టు దెబ్బతినకుండా ఉంటుంది. అంతేకాకుండా క్రమంగా వాడడం వల్ల తెల్ల జుట్టు నల్లబడుతుంది.
జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే నెలకు రెండు సార్లు జుట్టుకు హెన్నా పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యంగా పెరుగుతుంది.