ఇప్పుడు వేసవి కాలం ప్రారంభం కావడంతో మన శరీరాన్ని చల్లబరచుకోవడం కోసం వివిధ రకాల ఆహార పదార్థాలను, పండ్లు, పానీయాలను మాత్రమే తీసుకోవడానికి అందరూ ఇష్టపడతారు. ఈ విధంగా మన శరీరాన్ని చల్లగా ఉంచడానికి పెరుగు, ఎండు ద్రాక్షలను కలిపి తయారు చేసుకున్న మిశ్రమం తీసుకోవడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రెండు పదార్థాలను కలిపి తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో ఒకసారి చూద్దాం.
పెరుగు,ఎండు ద్రాక్ష ప్రయోజనాలు:
నిజానికి పెరుగు, ఎండుద్రాక్షలలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఇందులో విటమిన్ E, విటమిన్ A, విటమిన్ C, విటమిన్ B 2, విటమిన్ B12 , కెరోటోనాయిడ్స్ వంటివి ఉంటాయి. ఇవన్నీ శరీరాన్ని ఎంతో ఆరోగ్యకరంగా ఉంచుతాయి. ఎండుద్రాక్షలో అత్యధికంగా ఇనుము,పొటాషియం,కాల్షియం,ఫైబర్ వంటివి ఉంటాయి. ఇవన్నీ మన శరీరానికి వ్యాపించే అనేక రకాల వ్యాధుల నుంచి రక్షిస్తాయి.
పెరుగు ఎండుద్రాక్ష మిశ్రమాన్ని ఎలా చేయాలి:
ముందుగా ఒక గిన్నెలో అత్యధికంగా కొవ్వు కలిగిన పాలను వేడిచేయాలి. గోరువెచ్చగా ఉన్న పాలలో రెండు ద్రాక్షలను వేసి అందులో కొద్దిగా పెరుగును కలపాలి. అలా కలిపి పెట్టిన దానిని ఆరు గంటల పాటు పక్కన పెట్టాలి. ఆరు గంటల తర్వాత ఆ పదార్థం మొత్తం పెరుగు గా మారి గట్టిపడుతుంది. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని తినడం వల్ల వేసవి తాపాన్ని తగ్గించుకోవచ్చు.
పురుషులకు ఎందుకు ప్రయోజనకరం?
ఒక పరిశోధనలో భాగంగా ఈ ఎండుద్రాక్ష,పెరుగు కలిపిన మిశ్రమాన్ని పురుషులు అధికంగా తీసుకోవడం వల్ల వారిలో వీర్యకణాల నాణ్యత మెరుగుపడటానికి ఈ మిశ్రమం దోహదపడుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతేకాకుండా,పెరుగు తినడం వల్ల ఎన్నో రకాల వ్యాధుల నుంచి మనల్ని రక్షించుకోవచ్చు.
1). ఇంట్లో తయారు చేసుకున్న పెరుగు ,ఎండు ద్రాక్ష మిశ్రమాన్ని క్రమంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఉపయోగపడే మంచి బ్యాక్టీరియా ఉత్పత్తి చేస్తుంది.
2). ఈ మిశ్రమం శరీర ఎముకలను బలోపేతం చేయడంలో ఎంతో ప్రభావం చూపుతుంది.
3). శరీరంలో కీళ్ళ వాపు సమస్యతో బాధపడుతున్నవారు పెరుగు, ఎండు ద్రాక్షలు కలిపిన మిశ్రమాన్ని తీసుకోవడంవల్ల ఆ సమస్య నుండి విముక్తి కలుగుతుంది.
4). రక్త పోటు సమస్య తో బాధపడుతున్న వారు ఈ మిశ్రమం తినడం వల్ల ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి