
ఇలాంటి మొక్క చాలా అరుదుగా దొరుకుతుంది మనకు. ఈ మొక్క వల్ల ప్రయోజనాలు తెలిస్తే, ఈ మొక్కని ఎవరు వదిలిపెట్టరు. ఈ మొక్క వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం ఇప్పుడు..
1). ఈ మొక్క పుష్పించే మొక్కల జాతికి చెందినది. అంతేకాకుండా ఈ ఆకును మురిపిండి ఆకు అని కూడా అంటారు.
2). ఇది పంటి నొప్పిని తగ్గిస్తుంది . కాబట్టి దీనిని పిప్పెంటి ఆకు అని అంటారు. పంటి నొప్పిలన్నిటికీ ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.
3). ఈ మొక్కలు రెండు రకాలుగా లభిస్తాయి. ఒక జాతి మొక్కలు , ఆకులు గుండ్రంగా వుంటాయి. ఇక మరొక జాతి మొక్క ఆకుల అయితే చిన్నవిగా ఉండి చాలా ఎక్కువగా ఉంటాయి.
4). ఈ మొక్క యొక్క వేర్లతో పళ్ళను తోమితే దంతాలు తెల్ల పడతాయి, అంతేకాకుండా చిగుళ్ల నుండి కారే రక్తాన్ని కూడా ఆపుతుంది.
5). ఈ చెట్టు యొక్క ఆకులను మన పూర్వీకులు చర్మ సౌందర్యానికి వాడేవారు. ఈ ఆకును మెత్తగా నూరి అందులో కొంచెం పసుపు, వేసి బాగా రుబ్బి ముఖానికి పట్టించుకుంటే, చర్మం మరింత ప్రకాశవంతంగా అవుతుంది.
6). శ్వాసకోశ సమస్యలు తగ్గడానికి , విరోచనాలు అవ్వడానికి, ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిని ఒక చిన్న బౌల్లో నీళ్ళు పోసి , ఆకులను రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే ఆ ఆకులను తీసేసి, ఆ నీరు తాగడం వల్ల ఇలాంటి సమస్యల నుంచి దూరం కావచ్చు. అయితే ఈ నీటిని రెండు స్పూన్లు మాత్రమే తాగాలి.
7). ఈ ఆకుల రసం లోకి నిమ్మరసం కలిపి ఆ పదార్థాన్ని గజ్జి, తామర వచ్చిన వారికి పట్టించడంవల్ల తగ్గుతుంది.