ఈ క్రమంలోనే ఒకప్పుడు కేవలం ముసలి వాళ్లకు మాత్రమే తెల్ల వెంట్రుకలు కనిపించేవి. కానీ నేటి రోజుల్లో ఉరుకుల పరుగుల జీవితంలో కాలుష్యం పెరిగిపోవడంతో ఆహారపు అలవాట్ల కారణంగా పాతికేళ్ల కుర్రాడు కూడా తెల్ల వెంట్రుకలు వచ్చి ముసలాడిలా కనిపిస్తున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇటీవలి కాలంలో ఎంతో మంది తెల్ల వెంట్రుకలను కలర్ వేసి కవర్ చేస్తున్నవారు ఉన్నారు. అయితే ఇలా తెల్ల వెంట్రుకల విషయంలో ఇప్పటికే ఎంతోమంది లో అనుమానాలు అపోహలు మాత్రం అలాగే ఉండి పోయాయి అని చెప్పాలి.
ముఖ్యంగా తలలో వచ్చిన తెల్ల వెంట్రుక ఒక్కటి పీకేస్తే పీక తర్వాత తల మొత్తం తెల్ల వెంట్రుకలు వస్తాయి అని ఒక నమ్మకం అందరిలో ఉంది. ఇప్పటికీ దీనిని నమ్మే ఎంతోమంది తలలో తెల్ల వెంట్రుకలు పీకడానికి భయపడిపోతుంటారు. అయితే నిజంగానే ఇలా జరుగుతుందా లేదా ఇప్పుడు తెలుసుకుందాం.. తలలో వెంట్రుకలు తెల్లగా ఉండాలా అల్లగా ఉండాలా తేడాను నిర్ణయించేది మెలనిన్. కుదుళ్ల మొదలు మెలానిన్ ఉత్పత్తి లేకపోతే వెంట్రుకలు తెల్లగా మారిపోతూ ఉంటాయి. అయితే ఒక్క తెల్లవెంట్రుక పీకేస్తే అన్ని తెల్లగా మారిపోతాయన్నది ఇది కేవలం అపోహ మాత్రమే అని వైద్యులు అంటున్నారు. తలపై ఒకే ప్రాంతంలో వెంట్రుకలు గుంపుగా తెల్లగా మారడం వల్ల ఎంతోమంది అలా భావిస్తారని వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ మెలనిన్ ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పుడే తలలో వెంట్రుకలు తెల్లగా మారుతాయి అని అంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి