థైరాయిడ్.. ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరికి సర్వసాధారణం అయిపోయింది. ముఖ్యంగా ఈ వ్యాధి పురుషులలో కంటే స్త్రీలలోనే ఎక్కువగా కనిపిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆడవారిలో 20 సంవత్సరాలు వయసు దాటింది అంటే చాలు చాలామంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతూ సతమతమవుతున్నారు. ముఖ్యంగా థైరాయిడ్ రావడానికి అసలు కారణం ఇదీ అని మనం చెప్పలేము. ఎందుకంటే వాతావరణంలో కాలుష్యం, కూరగాయల్లో పురుగుల మందులు ఎక్కువగా వాడటం, ఒత్తిడి, జంక్ ఫుడ్, ఉప్పు అధికంగా వాడడం లాంటి కారణాల వల్ల కూడా థైరాయిడ్ వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇకపోతే కొంతమందిలో థైరాయిడ్ లక్షణాలను ముందే గుర్తించవచ్చు. ఎందుకంటే జుట్టు రాలిపోవడం , అధికంగా బరువు పెరగడం లేదా ఉన్నటువంటి బరువు తగ్గడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

ఇకపోతే థైరాయిడ్ సమస్య వచ్చినప్పుడు జుట్టు ఊడిపోతుంది . మహిళల్లో నెలసరి సమయంలో ఇబ్బందులు.. కడుపునొప్పి.. శ్వాస తీసుకోవడంలో సమస్యలు ఇలా మరెన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే థైరాయిడ్ కి చెక్ పెట్టాలి అంటే ఉల్లి,  కొత్తిమీర ఇందుకు సరైన మెడిసిన్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా థైరాయిడ్ తో బాధపడుతున్న వారికి కొత్తిమీర చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి తో పాటు డైటరీ ఫైబర్ థైరాయిడ్ సమస్యను తగ్గిస్తుంది. ఇకపోతే కొత్తిమీర తీసుకోవడం వల్ల ఎముకల నొప్పి నుండి ఉపశమనం పొందడం తోపాటు కొత్తిమీర లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ కారణంగా వైరస్ నుంచి బయటపడవచ్చు.

ముందు రోజు రాత్రి ఒక గ్లాసు నీటిలో కొత్తిమీర ఆకులను నానబెట్టి మరుసటి రోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే ఆ నీటిని తాగాలి. ఇక దీన్ని ఖాళీ కడుపుతో తాగితే థైరాయిడ్ కారకాలను నాశనం చేయవచ్చు. ఇక ఉల్లిపాయ కూడా థైరాయిడ్ సమస్యను తగ్గిస్తుంది.  ఉల్లి రసం తాగడం వల్ల ఉల్లి రసం లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ,  యాంటీ బ్యాక్టీరియల్,  యాంటీ ఫంగల్ లక్షణాలు థైరాయిడ్ సమస్యను తగ్గిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: