చాలామంది ఎక్కువగా నడుము నొప్పితో బాధపడుతూ ఉంటారు. ఇక నడుము నొప్పి తగ్గడం లేదని ఎక్కువగా ఆస్పత్రిల చుట్టూ తిరుగుతూ ఉంటారు. నడుము నొప్పికి విపరీతంగా మందులు వాడారంటే.. పలు ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి. నడుము నొప్పి చిన్న చిన్న పనులు చేయడం వల్ల విముక్తి పొందవచ్చని కొంతమంది నిపుణులు తెలియజేస్తున్నారు. వాటి గురించి ఇప్పుడు పూర్తి వివరాలను తెలుసుకుందాం.నొప్పి ఎక్కువగా ఉన్నవారు తగ్గించుకోవాలి అంటే ముఖ్యంగా పని ఒత్తిడిని తగ్గించుకోవలసి ఉంటుంది.. వెన్నుముక కండరాలు బలోపేతం చేయడంతోపాటు ప్రతిరోజు కొన్ని అలవాట్లను కూడా మార్చుకుంటూ ఉండాలి. పడుకునే సమయంలో వెనుక భాగాన ఒత్తిడి ఎక్కువగా పడుతుంది.. నడుము నొప్పి ఎక్కువగా ఉన్నవారు మోకాళ్ళ కింద దిండు పెట్టుకొని నిద్రించడం వల్ల కాస్త రిలీఫ్ గా అనిపిస్తుంది. ముఖ్యంగా నడుము నొప్పి తగ్గించుకోవడానికి వ్యాయామం చాలా సహాయపడుతుంది ఇక వ్యాయామం చేసే సమయంలో నడుముకు సంబంధించి ముఖ్యమైన కండరాలను కదిలేలా చేస్తూ ఉండాలి.


ఎముకలు బలంగా ఉన్నప్పుడు నడుము నొప్పి సమస్యలు ఎక్కువగా ఉండవు బలహీనమైన ఎముకలు ఉన్నప్పుడే ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి క్యాల్షియం విటమిన్ డి వంటివి పుష్కలంగా ఉండడం వల్ల ఎముకలు బలం చేకూరుతాయి. పాలు, పెరుగు, ఆకుకూరలు ,విటమిన్ కు సంబంధించిన వాటిని తరచూ తింటూ ఉండడం మంచిది. ముఖ్యంగా నడుము నొప్పి నివారించడం కోసం చెప్పులు వినియోగం పైన కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఎత్తు మడమ గల చెప్పులను ఎక్కువగా వేసుకున్న వారు నడుము నొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.అందుచేతనే ఎక్కువగా హై హీల్స్ ను ధరించకూడదు. ఆఫీసులో కూర్చున్నప్పుడు నిలబడినప్పుడు సరైన పద్ధతిలోనే కూర్చోవాలి మన కూర్చునే విధానాన్ని బట్టి కూడా నడుము నొప్పి ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంటుంది. కంప్యూటర్ ముందర కూర్చొని పనిచేసే వారు కూర్చుని ఎంపిక చేసుకోవడం మంచిది..

మరింత సమాచారం తెలుసుకోండి: