ప్రస్తుత కాలంలో ఈ ఉరుకుల పరుగుల బిజీ జీవితం కారణంగా చాలా మంది కూడా నీళ్లను సరిగ్గా తాగడం లేదు. దీంతో చాలా రకాల వ్యాధులను కొని తెచ్చుకుంటున్నారు. అయితే ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం పోషకాహారం మాత్రమే తింటే సరిపోదు. నీళ్లను కూడా తగినంత మోతాదులో ఖచ్చితంగా తాగాల్సి ఉంటుంది.ఇక ముఖ్యంగా షుగర్ పేషెంట్లు అయితే సాధారణ వ్యక్తుల కన్నా రోజూ కాస్త ఎక్కువ మోతాదులోనే నీళ్లను తాగాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. షుగర్ పేషెంట్లు ఏదైనా తీసుకున్న వెంటనే అందులో ఉన్న కార్బొహైడ్రేట్లను బట్టి రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ అనేవి పెరుగుతాయి. అయితే గ్లూకోజ్ లెవల్స్ కనుక ఎక్కువైతే శరీరం దాన్ని మూత్రం ద్వారా బయటకు పంపుతుంది. ఈ క్రమంలో శరీరంలో ఖచ్చితంగా తగినంత నీరు ఉండాలి.నీరు లేనట్లయితే శరీరం ఖచ్చితంగా డీహైడ్రేషన్ బారిన పడుతుంది. దీంతో మీ కిడ్నీలపై ఖచ్చితంగా ఒత్తిడి పెరుగుతుంది.


అదే నీళ్లను తగిన మోతాదులో తాగితే గ్లూకోజ్ లెవల్స్ పెరిగినప్పుడు ఎక్కువగా ఉన్న గ్లూకోజ్ మూత్రం ద్వారా ఈజీగా బయటకు పోతుంది. దీంతో షుగర్ లెవల్స్ కూడా తగ్గుతాయి. కాబట్టి షుగర్ పేషెంట్లు తప్పనిసరిగా ఈ విషయం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఇక మహిళలు అయితే రోజుకు కనీసం 1.6 లీటర్ల నీటిని తాగాలని.. పురుషులు అయితే రోజుకు ఖచ్చితంగా కనీసం 2 లీటర్ల నీళ్లను అయినా సరే తాగాలని వైద్యులు చెబుతున్నారు. ఇంకా అలాగే షుగర్ పేషెంట్లు ఇంకాస్త ఎక్కువ మోతాదులోనే నీళ్లను తాగాల్సి ఉంటుందని కూడా అంటున్నారు. అయితే షుగర్ లేకున్నా సరే నీళ్లను సరైన మోతాదులో తాగితే మన శరీరంలో అధికంగా ఉండే షుగర్ మూత్రం ద్వారా ఈజీగా బయటకు వస్తుంది. దీంతో షుగర్ లెవల్స్ కూడా నియంత్రణలోకి వస్తాయి. అందువల్ల భవిష్యత్తులో కూడా షుగర్ రాకుండా ఉంటుంది.ఇంకా అలాగే కిడ్నీలు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: