ఇక ప్రస్తుతం టమాట ధర ప్రతి రాష్ట్రంలో కూడా 100 రూపాయలకు పైగానే పలుకుతుంది. కొన్ని రాష్ట్రాలలో అయితే ఏకంగా 200 రూపాయల వరకు టమాటా ధర పలుకుతూ ఉండటం గమనార్హం. దాదాపు నెలరోజుల క్రితం 20 రూపాయలు ఉన్న టమాటా ఇప్పుడు ఒక్కసారిగా పెరిగిపోవడంతో అటు టమాటా రైతులు లాభాల్లో మునిగి తేలుతున్నారు. కానీ సామాన్యులు మాత్రం ఆందోళనలో ఉన్నారు. ఇలాంటి సమయంలో ప్రస్తుతం టమాటాకు సంబంధించి ఏ చిన్న వార్త తెరమీదకి వచ్చిన అది హాట్ టాపిక్ గా మారిపోతుంది అని చెప్పాలి. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే.
సాధారణంగా టమాటా ఏ రంగులో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎరుపు రంగుతో తల తల మెరిసిపోతూ ఉంటుంది. కానీ టమాటాలు నల్ల రంగులో ఉంటాయి అన్న విషయం తెలుసా అంటే.. తెలీదు అని ప్రతి ఒక్కరు సమాధానం చెబుతారు. అయితే ఇప్పుడు నలుగురంగు టమాట సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మారిపోయింది. ఎరుపు, ఉదా రంగు విత్తనాలను సేకరించి ఇక ఈ నలుపు రంగుల టమాటాలను సృష్టించారట. ఈ టమాటాను ఇండిగో రోజ్ అని పిలుస్తారట. క్యాన్సర్ తో పాటు ఎన్నో ఆరోగ్య సమస్యలకు ఈ టమాటా చెక్ పెడుతుందట. హిమాచల్ ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, యూపీ, మధ్యప్రదేశ్ లలో ప్రస్తుతం ఈ నలుపు రంగు టమాటాలను సాగు చేస్తున్నారట. ఏపీలో కూడా ఇక ఈ నలుపు రంగు టమాటా సాగు చేసుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి