ఈజిప్టు జాతికి చెందిన ఈడెస్ అనే ఆడ దోమలు కుట్టడం వల్ల డెంగ్యూ జ్వరం అనేది వస్తుంది. డెంగ్యూ బారిన పడినప్పుడు మనలో ఖచ్చితంగా వాంతులు, తలనొప్పి, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, వికారం, దద్దుర్లు ఇంకా కళ్ల నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే అస్సలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి. లేదంటే నీరసం, అలసట, రక్తస్రావం, విరోచనాలు, రక్తపు వాంతులు, కడుపు నొప్పి ఇంకా చిగుళ్ల నుండి రక్తం కారడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటిని మరింత నిర్లక్ష్యం చేసే ఖచ్చితంగా ప్రాణాపాయం కూడా కలిగే అవకాశం ఉంది. వీటికి తగిన చికిత్సను తీసుకుంటేనే కొన్ని ఆయుర్వేద చిట్కాలను వాడడం వల్ల డెంగ్యూ జ్వరం నుండి మరింత త్వరగా కోలుకోవచ్చు. డెంగ్యూ జ్వరాన్ని త్వరగా తగ్గించే ఆయుర్వేద చిట్కాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నప్పుడు మెంతి ఆకులను ఉపయోగించడం వల్ల నొప్పులు ఈజీగా తగ్గుతాయి. మెంతి ఆకులను నీటిలో వేసి రాత్రంతా బాగా నానబెట్టాలి. తరువాత ఉదయాన్నే ఈ నీటిని వడకట్టి తాగాలి. ఇలా చేయడం వల్ల నొప్పులు వెంటనే తగ్గుతాయి. ఇంకా అలాగే నారింజ పండ్ల రసాన్ని తాగాలి. ఎందుకంటే ఈ రసాన్ని తాగడం వల్ల శరీరం హైడ్రేడెట్ గా ఉంటుంది.


ఇంకా అలాగే శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇక డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నప్పుడు ప్లేట్లెట్స్ తగ్గుతాయన్న సంగతి మనకు తెలిసిందే. ఈ ప్లేట్లెట్స్ ను పెంచడంలో వేపాకులు మనకు బాగా దోహదపడతాయి. ఈ వేపాకులను తీసుకోవడం వల్ల శరీరంలో వైరస్ వ్యాప్తి కూడా తగ్గుతుంది.ఇక వేపాకులను నీటిలో కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే వేపాకుల వలె బొప్పాయి ఆకులు కూడా మనకు ఎంతో మేలు చేస్తాయి. రోజుకు రెండు సార్లు మనం బొప్పాయి ఆకులను పేస్ట్ గా చేసి తీసుకోవడం వల్ల డెంగ్యూ లక్షణాలు తగ్గడంతో పాటు శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ప్లేట్లెట్స్ కౌంట్ కూడా పెరుగుతుంది.ఇక కొబ్బరి నీళ్లను తాగడం వల్ల శరీరం చాలా హైడ్రేడెట్ గా ఉంటుంది. మన శరీరానికి కావల్సిన శక్తి కూడా లభిస్తుంది. ఇంకా అలాగే నల్ల మిరియాల పొడిని పాలల్లో వేసి మరిగించి తీసుకోవడం వల్ల కూడా మంచి పలితం ఉంటుంది. ఇన్పెక్షన్ ను తొలగించి వైరస్ ను నశింపజేయడంలో కూడా ఇది ఎంతో తోడ్పడుతుంది. ఇంకా వీటితో పాటు నిమ్మజాతికి చెందిన ఉసిరి, కివి, బత్తాయి వంటి వాటిని తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: