
అయితే అలా చేయడం మోర్ మోర్ డేంజరస్ అంటున్నారు వైద్యులు . సాధారణంగా బ్రషింగ్ అయిపోయిన తర్వాత వెంటనే బ్రష్ ని తడిపి పక్కన పెట్టే అలవాటు మానుకోవాలి అని . అది బ్యాక్టీరియాని ఇంకా ఎక్కువగా చేసి మన పొట్టలోకి పంపించేస్తుంది అని ..మనం రాత్రంతా నిద్రపోయి ఉదయాన్నే లేచి బ్రష్ చేసుకుంటాం. ఎందుకు అంటే బ్యాక్టీరియా బయటకు పంపించడానికి. నోట్లో ఉండే రకరకాల క్రిములు తరిమి కొట్టడానికి . అయితే ఉదయాన్నే వాటిని క్లీన్ చేసేసి ఆ తర్వాత పనులు కానిస్తూ ఉంటాము. అయితే బ్రష్ చేసిన తర్వాత అలా తడిచేసి బ్రష్ ను పక్కన పెట్టేయడం ద్వారా మళ్లీ బ్యాక్టీరియా వచ్చి అక్కడికి చేరుతుంది అంటున్నారు డాక్టర్లు.
బ్రషింగ్ అయిపోయిన తర్వాత బ్రష్ పై నోట్లో ఉండే బ్యాక్టీరియా అంతా వచ్చి చేరుతుంది . అయితే సరిగ్గా క్లీన్ చేసుకోకపోతే అది చాలా చాలా ప్రమాదం అంటున్నారు వైద్యులు . బ్రష్ అయిపోయిన వెంటనే నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత వెంటనే పక్కన పెట్టకుండా కొద్దిసేపు దులపాలి.. ఆ తర్వాత ఆరబెట్టాలి. ఆ తర్వాత పక్కన స్టోర్ చేసి పెట్టాలి. అయితే చాలామంది బ్రష్ కి ఒక క్యాప్ లాంటిది పెడుతూ ఉంటారు . అది మరింత డేంజర్ అంటున్నారు వైద్యులు. అలా క్యాప్ పెట్టి అలానే ఉంచితే బ్యాక్టీరియా ఇంకా ఎక్కువగా చేరిపోతుంది అని వైద్యులు చెప్పుకొస్తున్నారు . బాక్స్ లాంటి కవర్స్ బ్యాక్టీరియా కి ఇంక్యూబేటర్స్ లా పనిచేస్తాయి అంటున్నారు వైద్యులు . అందుకే పొరపాటున కూడా బ్రష్ కవర్స్ వాడకూడదు అంటున్నారు. ముఖ్యంగా తడి బ్రష్ ని ఇలా అస్సలు కవర్ చేయకూడదు అని.. దాన్ని పూర్తిగా తడిపిన తర్వాత సరైన విధంగా గాలికి తగిలేలా ఉంచడమే మంచిది అంటున్నారు . అంతేకాదు చాలామంది ఉదయం ఒక్క పూట బ్రష్ చేసుకుంటూ ఉంటారు . అది తప్పు అని నిద్రలేచిన తర్వాత నిద్రపోయే ముందు బ్రష్ చేసుకోవడం చాలా చాలా మంచి హ్యాబిట్ అని చెప్పుకొస్తున్నారు..!