
ఈ కోరికను స్పిరిట్ సినిమా తీర్చబోతోంది. అయితే సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అనే ప్రశ్నలపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమా గురించి మరో క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. స్పిరిట్ సినిమా లో ఓ సీనియర్ హీరోని తీసుకునే ఆలోచనలో ఉన్నారని సమాచారం. మలయాళ లెజెండరీ నటుడు మమ్ముట్టిని కీలక పాత్రలో తీసుకోవాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట. ఈ వార్త నిజమైతే ప్రభాస్ - మమ్ముట్టి స్క్రీన్ స్పేస్ పంచుకోవడం అభిమానులకు డబుల్ ట్రీట్ అవుతుంది.
ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా త్రిప్తి దిమ్రిని ఫైనల్ చేశారు. ఆమె గతంలో నటించిన చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రభాస్ సరసన ఆమె కొత్తగా కనిపించబోతోంది. మరోవైపు మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఇప్పటికే సందీప్ రెడ్డి వంగాతో మ్యూజిక్ సిట్టింగ్స్ పూర్తి చేశారని సమాచారం. రామేశ్వర్ పవర్ ఫుల్ బీజీఎం, సౌండ్‌ట్రాక్‌తో ఈ సినిమాకు మరో రేంజ్ ఇవ్వబోతున్నారు. ఈ సినిమాను టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. అంతర్జాతీయ స్థాయి టెక్నికల్ టీమ్ ఈ ప్రాజెక్ట్ కోసం ఎంపిక అవుతుందని టాక్. కథాంశం విషయంలోనూ సందీప్ రెడ్డి వంగా కొత్తదనాన్ని చూపించబోతున్నారని తెలిసింది.