
ఒకప్పుడు తన సినిమాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న హీరో రాజశేఖర్ ని, విజయ్ దేవరకొండ సినిమాలో విలన్ గా నటించడానికి సంప్రదించినట్లు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి కథ చర్చలు జరగగా రాజశేఖర్ కూడా ఇందులో నటించడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం పైన ఇంకా అధికారికంగా చిత్ర బృందం ప్రకటించలేదు. కానీ టాలీవుడ్ లో ఈ సినిమా గురించి గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజశేఖర్ ఇందులో ఒక సీరియస్ రోల్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ విషయం తెలిసిన అభిమానులు కూడా ఖుషి అవుతున్నారు.
విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన్ చిత్రానికి రాజశేఖర్ పర్ఫెక్ట్ విలన్ గా సరిపోతారని అభిమానులు కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి అక్టోబర్ రెండవ తేదీ నుంచి సినిమా షూటింగ్ మొదలుపెట్టేలా చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ చిత్రంతో విజయ్ దేవరకొండ దశ తిరుగుతుందేమో చూడాలి మరి. ఈ ఏడాది విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ సినిమా విడుదలై పర్వాలేదు అనిపించుకుంది. ఇక ఈ సినిమా సీక్వెల్ ని కూడా చిత్ర బృందం ప్రకటించింది. మరి ఎప్పుడు విడుదల చేస్తారో చూడాలి