
గోపీచంద్ మలినేని ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేసినట్లు సమాచారం. ప్రత్యేకంగా సెకండ్ హాఫ్‌లో యాక్షన్ సీక్వెన్సెస్‌తో పాటు హృదయాన్ని కదిలించే ఎమోషనల్ సన్నివేశాలను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బాలయ్య పాత్రలో ఒక శక్తివంతమైన ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఉండబోతోంది.
ఈ ఫ్లాష్‌బ్యాక్ లో ఆయన మాఫియా నేపథ్యంతో కనిపించనున్నారు. ఇది బాలయ్య కెరీర్‌లో కొత్త తరహా షేడ్. ఈ సినిమాను వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు నిర్మించనున్నారు. భారీ స్థాయిలో, విపరీతమైన అంచనాలతో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఇప్పటికే మాస్ ఆడియెన్స్‌లో బాలయ్య - గోపీచంద్ కాంబినేషన్‌పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. క్రాక్ వంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన గోపీచంద్ మలినేని, ఇప్పుడు బాలయ్య కోసం మరింత పవర్‌ఫుల్ స్టోరీ రెడీ చేశాడని సమాచారం.
ఇటీవల గోపీచంద్ మలినేని సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ “గాడ్ ఆఫ్ మాసెస్ ఈజ్ బ్యాక్. ఈసారి మా గర్జన మరింత గట్టిగా వినిపించబోతోంది. బాలకృష్ణతో మళ్లీ వర్క్ చేయడం చాలా గౌరవంగా, ఆనందంగా ఉంది. ఈ సినిమా చరిత్రలో నిలిచిపోయేలా ఉంటుంది ” అని చెప్పడంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరిగాయి. నందమూరి బాలకృష్ణ 111వ సినిమాగా రాబోతున్న ఈ ప్రాజెక్ట్ మాస్‌తో పాటు భావోద్వేగాలను కలిపిన పర్ఫెక్ట్ ప్యాకేజీగా ఉండబోతుందని ఫిల్మ్ నగర్ టాక్. అభిమానులు, ప్రేక్షకులు ఇప్పుడు ఈ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.