బాల్య దశలో ఎదుగుదల లోపం చిన్నారులకు శాపంగా మారుతోంది. పరుగులు పెట్టాల్సిన చిన్నారులు రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. అయితే రక్తహీనతకు ప్రధాన కారణం పోషకాహార లోపం. చిన్న పిల్లల్లో కడుపులో నట్టలు ఉండటం వల్ల కూడా రక్తహీనత ఏర్పడుతుంది. సరిపడా పౌష్టికాహారం అందక బక్కచిక్కి పోతున్నారు. కొంత మంది వ్యాధులతో పోరాడుతున్నారు. మరి కొంత మంది పోరాడలేక ప్రాణాలను వదులుతున్నారు.  గర్భిణులు, పిల్లలకు పోషకాహారం అందించేం దుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను తీసుకొచ్చాయి.

అయితే ఇంతకీ రక్త హీనత అంటే ఏంటి అనే ప్రశ్నలు చాల మందిని వెంటాడుతూనే ఉంటాయి. ఇక శరీరంలోని రక్తం ఎర్రగా ఉండడానికి కారణం అందులోని హిమోగ్లోబిన్ అని అందరికి తెలిసిన విషయమే.హిమోగ్లోబిన్ తయారవడానికి మాంసకృత్తులు, ఐరన్‌‌, ఇతర పోషక పదార్థా లు తోడ్పడుతాయి. సాధారణంగా మగవారిలో ప్రతి 100 గ్రాముల రక్తంలో 13 గ్రాములు, ఆడవారిలో 12 గ్రాములు, 6 ఏండ్ల లోపు పిల్లల్లో 11 గ్రాములు, గర్భిణుల్లో 11 గ్రాములు, బాలిం తల్లో 12 గ్రాములు, 6 నుంచి 12 ఏండ్ల లోపు పిల్లల్లో 12 గ్రాముల హిమోగ్లోబిన్‌‌ ఉండాలి. ఈ మేరకు హిమోగ్లోబిన్‌‌ స్థాయి అంతకంటే తక్కువ ఉంటే రక్తహీనతగా పరిగణిస్తారు.

ఇక  రాష్ట్రంలో సమగ్ర శిశు అభివృద్ధి పథకం.. కింద గర్భిణులు, బాలింతలు, పిల్లలకు గుడ్లు, పాలు, పప్పులు అందజేస్తున్నారు. అయితే ఈ పథకాల అమలులో లోపాలున్నట్టు అనేక ఆరోపణలున్నాయి. నాసిరకం పాలు పంపిణీ చేయడం, రోజూ ఇవ్వాల్సిన గుడ్లను, నెలలో ఒకేసారి లేదా రెండు దఫాల్లో ఇస్తున్నారన్న విమర్శలున్నాయి.

అయితే ఆర్నెల్లు గడవకుండానే చిన్నారులు తల్లిపాలకు దూరమవుతుండటం కూడా పిల్లల ఆరోగ్యం పై ప్రభావం చూపుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. రెండేండ్ల వరకు పిల్లలకు అన్ని రకాల పోషకాహారాలు అందించాలని సూచిస్తున్నా రు. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలపై తొలి రెండేం డ్లలో అందే పోషకాహారమే అధిక ప్రభావం చూపుతుం ది. పిల్లలకు నాణ్యమైన పాలు, గుడ్లు, పండ్లు అందేలా ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టాలని డాక్టర్లు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: