చాల మంది తల్లిదండ్రులు అబ్బాయిల కంటే అమ్మాయిలకే పనులు చెబుతుంటారు. ఇక ఇలా చేయడం వలన పిల్లలలో కూడా లింగ వ్యత్యాసాలు వస్తాయి. అయితే ప్రతి తల్లి తన పిల్లలకి ఖచ్చితంగా నేర్పించాలి. ఇంటి పని వంటపని, ఏదైనా ఎవ్వరైనా చేసేలా పిల్లలను తయారు చేయాలి.ఇద్దర్నిసమానం గా చూడాలి.ఒకసారి ఒకరు ఇంటిలో పనిచేస్తే ఇంకొకరు బయటపని చేసుకురావాలి అలా మార్చి మార్చి వారితో పనులు చేయిస్తూ ఉండాలి.

ఇక మీ పిల్లలకు 12 ఏళ్ల లోపు చిన్న చిన్న పనులు చేయడం నేర్పించాలితర్వాత వంట చేయడం నేర్పించాలి. వంట అనేది ప్రతి ఒక్కరికీ అవసరం కాబట్టి.. దానిపై అవగాహన పెంచాలి. పరిస్థితిఎలాంటిది అయినాకూడా శారీరకంగా హింసించడం చాలా పెద్ద నేరమని,తల్లిదండ్రులు  ఖచ్చితంగావారికీ అర్ధమయేలా చెప్పాలి.ఎవ్వరిని అయినా గౌరవించడం చాల అవసరమని ఎట్టి పరిస్థితులలో అగౌరవం గా నడుచుకోకూడదని పిల్లలకు తెలియచెప్పాలి.స్త్రీ లైనా, పురుషులైనా  సమానంగా విలువ ఇవ్వాలని వివరించాలి.

అయితే అబ్బాయిలు ఏడ్చినప్పుడు, ఎమోషనల్ గా ఫీలయినప్పుడు సాధారణంగా తల్లిదండ్రులు.. తిడుతూ ఉంటారు. అబ్బాయిలు ఇంత సెన్సిటివ్ గా ఉండకూడదు అని.. కానీ.. అలా  ఏడవకుండా  ఉంటే జీవితంలో మానసిక వ్యాధులకు కారణమవుతుంది. ఎమోషనల్ ఉన్నప్పుడు ఏడవడములో తప్పు లేదని.. బాధను బయటపెట్టేయాలని వివరించి  చెప్పాలి.చాలా సందర్భాల్లో అబ్బాయిలు.. కొన్ని సందర్భాలలో అమ్మయిలు చాలా దూకుడు స్వభావం కలిగి ఉంటారు.అలా ఉండడం ఎంత ప్రమాదకరమో వివరిస్తూ ఇతరుల పట్ల జాలి, దయ కలిగి ఉండటం ఎంత ముఖ్యమో చెప్పాలి.

ఇక ఇంటికి  వచ్చిన వారితో ఎంత మర్యాదగా ఉండాలో ఎవ్వరికి  ఎలా  సహాయం  చేయాలో ఎలా మాట్లాడాలో తినే విషయం లో ఎలా ఉండాలో వంటి విషయాలు తల్లిదండ్రి  తప్పక  నేర్పించాలి. చిన్నప్పటినుండే ఎందుకు అని పొరపాటున కూడా అనుకోవద్దు.. అప్పటినుండి నేర్పితేనే వారికీ బాగా అర్ధం అవుతుంది అని గుర్తు పెట్టుకోండి గారాబం గా చూసుకుంటూ వారికీ ఏమి తెలియకుండా పెంచడం వలన జీవితం లో ఎన్నో సమస్యలకు ఇబ్బందులకు గురిఅవవలిసి ఉంటుంది అని మరువకండి.

మరింత సమాచారం తెలుసుకోండి: