పిల్లల ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు పిల్లలు చదుకునేటప్పుడు ఏకాగ్రతను కోల్పోతుంటారు. అయితే ఏకాగ్రతతో దృష్టిని నిలపడం నిజానికి పిల్లలకు చాలా కష్టమైన పనే. కొంతమందికి స్వతహాగా ఉంటే, కొంతమందికి పెద్దల భయంతో బలవంతాన అలవర్చుకుంటారు. అలా కాకుండా పిల్లలు ఇబ్బంది పడకుండా వారికీ అలవాటయ్యేలా చెయ్యాలంటే పెద్దలు కాస్త శ్రమపడాల్సి ఉంటుంది.

ఇక బాబు గానీ, పాపా కానీ ఏదైనా ఒక పనిలో లీనమవడం పెద్దలు గమనిస్తే వాళ్ళను డిస్టర్బ్ చేయకుండా కొనసాగనివ్వాలి. వారి ధ్యాస మళ్లించే ప్రయత్నాలేవీ చేయకూడదు. వాళ్ళు చెప్పిన పనిని మెచ్చుకుంటూ దానిని ఇంకా కొనసాగించేలా ప్రోత్సహించాలి. వాళ్ళ పక్కనే మీరూ నిలబడి సహాయపడటమో, మరో పని చేస్తూనో వారిని గమనిస్తుండాలి. మధ్య మధ్యలో ప్రశంసలు, చిన్న సూచనలు ఇవ్వచ్చు. ఇలా చేయడం వల్ల మీరున్నంతసేపో అ పని చేసి ఒక పనిపై ఎక్కువ సమయం గడిపినవరవుతారు.

అయితే పిల్లలకు ఇదే క్రమేపి ఏకాగ్రత పెరగడానికి దోహదం చేస్తుంది. పిల్లలు చేయాల్సిన పనులను వారికి ఆసక్తికరంగా ఉండేలా మార్చండి. ఈ రోజు ఇంగ్లీష్ పాఠం పూర్తిగా రెండు సార్లు చదివితే కథ చెప్తానని, తెలుగు హోం వర్క్ నీట్ గా రాస్తే పాట నేర్పుతానని- ఇలా వర్క్ ఆసక్తి కలిగే విషయాలను చెప్పాలి.

ఇక పాఠమంతా చదివాక ఫలానా పదం ఎన్నో లైనులో ఉందో చూసి చెప్పు. ఈ పదం స్పెల్లింగ్ నేను చెప్తాను కరేక్టేనేమో నువ్వు చూడు ఇలా చిన్న చిన్న ఆటలు, మాటలతో వారు ఎక్కువసేపు ఇక పనిలో కొనసాగేలా చేయవచ్చు. అయితే రోజూ కొంచెం చొప్పున సమయం పెంచుకుంటూ వెళ్ళాలి. కానీ ఒకే రోజు గంటసేపు కుర్చోబెట్టకూడదు. పిల్లలు ఎక్కువగా ఇష్టపడేది కార్టూన్ ఛానల్ చూడడం. వారిని రోజులో కొంత సమయం వారికి నచ్చిన ఛానల్ ని చూడనివ్వడం.దాని వాళ్ళ పిల్లలో కొంచెం స్ట్రెస్ తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: