మన ఇండియాలో అన్ని ప్రాంతాల వారికి సొరకాయ అందుబాటులో ఉంటుంది.  దీనితో మన భారతదేశంలోని అన్ని ప్రాంతాల వారు ఈ సొరకాయను రకరకాలుగా ఉపయోగిస్తారు. చాల సున్నితంగా ఉండే ఈ లేత ఆకుపచ్చ కలర్ లో ఉండే సోరకాయతో చేసే వంటలు చాల రుచికరంగా ఉంటాయి.

చాలామంది ఈ సోరకాయను గ్రేవీ రూపంలో ఎక్కువగా తీసుకుంటారు.  ఈ సోరకాయను కేవలం మన ఇండియాలోనే కాకుండా ప్రపంచంలోని చాల దేశాలలో రకరకాల వంటలలో వాడుతూ ఉంటారు.   అయితే  ఏ పండుని అయినా లేదా విజటబుల్ ను అయినా జ్యూస్ రూపంలో తీసుకుంటే ఎన్నో ఉపయోగాలు ఉంటాయి అని చెపుతున్న నేపధ్యంలో ఇప్పుడు ఈ సరోకాయ జ్యూస్ వల్ల వచ్చే ప్రయోజనాలను తెలుసుకుందాం.

ముఖ్యంగా సొరకాయ జ్యూస్ ను తేనెతో కలిపి తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉండటమే కాకుండా ఏడు రకాల వ్యాధులను నయం చేయవచ్చని అధ్యయనాలు చెపుతున్నాయి.  ముఖ్యంగా సొరకాయ జ్యూస్ ను ఒక టేబుల్ స్పూన్ తేనెతో కలిపి తీసుకుంటే మన శరీరంలోని యాసిడ్ లెవెల్స్ మెరుగుపరిచి జీర్ణక్రియ మెరుగుపరిచే గుణాలుంటాయి అని అంటున్నారు.

దీనివల్ల ఎసిడిటీ, కాన్ట్పిపేషన్ వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఈ హోం మేడ్ జ్యూస్ బరువు తగ్గించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని డైటీషియన్స్ చెపుతున్నారు. ఈ న్యాచురల్ హెల్త్ డ్రింక్ ను తేనెతో మిక్స్ చేయడం వల్ల యూరినరీ ఇన్ఫెక్షన్స్ కి ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. 

అలాగే యూరిన్ లో యాసిడ్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. హైపర్ టెన్షన్ నివారించడంలో ఈ హోంమేడ్ డ్రింక్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. సొరకాయ, తేనె కలిపి తీసుకోవడం వల్ల ధమనులకు రక్తప్రసరణ ఆరోగ్యకరంగా జరుగుతుందని వైద్యులు కూడ సలహాలు ఇస్తున్నారు.  

ఈ జ్యూస్ వల్ల  హైపర్ టెన్షన్ కంట్రోల్ అవ్వడమే కాకుండా ఈ సొరకాయ జ్యూస్ లో విటమిన్స్, క్యాల్షియం, ఫోలేట్ పుష్కలంగా లభిస్తాయి. ఇది నరాలను రిలాక్స్ చేసి ప్రశాంతతను కలిగిస్తుంది. ఈ హోంమేడ్ హెల్త్ డ్రింక్ కాలేయాన్ని లివర్ ని క్లెన్స్ చేయడానికి సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తారు. అంతేకాదు లివర్ ఇన్ల్ఫమేషన్ తగ్గించడానికి కూడ ఈ జ్యూస్ సహాయపడుతుంది.  ఇలా అనేక ప్రయోజనాలు ఉన్న ఈ జ్యూస్ ను ప్రతిరోజు తీసుకోమని వైద్యులు చెపుతున్నారు అంటే ఈసోరకాయ ప్రాముఖ్యత ఎంత ఉందో అర్ధం అవుతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: