ఎంతటి గొప్పవారైనా సరే.. మీరు ఎంత స్వయం సమృద్ధి సాధించినా సరే.. ఎప్పడో ఒకప్పుడు ఒకరి సహాయం తప్పని సరి. అలా ఒకరి సాయం పొందేందుకు ఆత్మాభిమానం అని ఫీల్ కానవసరం లేదు. ఎంతో గొప్పవారికి కూడా ఇతరుల సాయం అవసరమైంది. సరైన సహాయకులు ఉంటేనే పై అధికారులు మంచి విజయాలు అందుకోగలుగుతారు.

 

అలాగే కష్టాల్లో ఉన్న ఇతరులను ఆదుకోవడమూ మరిచిపోవద్దు.. ఒకడితో నాకేం పని.. నా దారి నాదే అనే తత్వం సమాజంలో మంచిది కాదు. ఇతరుల సాయం ఎంత గొప్పదో.. ఇతరులకు సాయం పడటమూ అంతే గొప్పది.. ఈ విషయం చరిత్ర చాలాసార్లు మన కళ్లకు కట్టింది. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకుంటే జీవితం ఆనందమయమవుతుంది. నేర్చుకోవడానికి ఎక్కడా సిగ్గుపడాల్సిన పని లేదు.

 

అంత గొప్ప శ్రీరామ చంద్రుడు సైతం.. సీతమ్మ జాడ కనుక్కునేందుకు, రావణుడిపై పోరాడేందుకు వానరుల సాయం తీసుకున్నాడు. ఆ తర్వాత విభీషణుడు రాముడికి సాయం చేశాడు. హనుమంతుడు సంజీవని తీసుకొచ్చి రాముని తమ్ముడి ప్రాణాలు కాపాడాడు. అలాగని రాముడిని తక్కువ అంచనా వేయగలమా..

 

ఇది పురాణం అనుకుంటే.. బ్రిటీష్ వారిపై పోరాడేందుకు మన అల్లూరి సీతారామరాజు కోయల సాయం తీసుకున్నాడు. చరిత్రలో ఇలాంటి ఉదాహణలు ఎన్నో. సాయం పొందడం, సాయం చేయడం ఉత్తమ వ్యక్తికి మంచిగుణాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: