ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరు తమ నిజ జీవితంలో బిజీబిజీ జీవితాన్ని గడుపుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో తినడానికి కూడా సమయం లేని విధంగా రకరకాల పనులలో నిమగ్నమవుతారు..తినాల్సిన టైంలో తినకుండా.. ఎప్పుడో వారికి కుదిరినప్పుడు తినడం వల్ల గ్యాస్ సమస్య వస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇక చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఇలా గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారు.

అధికంగా కడుపులో గ్యాస్ ఫామ్ అయినప్పుడు వాంతులు అవ్వడం, కడుపులో మంట, అజీర్తి, నీరసం, కాళ్ల నొప్పులు వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మనం తీసుకునే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే , కడుపులో ఉండే గ్యాస్ ఇట్టే దూరం అవుతుందట. అయితే అది ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..

ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసే సమయంలో ప్రతి రోజు కూడా తాజా పండ్లను తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రోటీన్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, హెల్దీ ప్యాట్స్ ఉండేలా జాగ్రత్త పడాలి. సాధారణంగా ఆహారం ఎక్కువగా తీసుకుంటే అధిక బరువు పెరుగుతారని చాలా మంది రోజులో కొంత ఆహారం మాత్రమే తీసుకుంటూ ఉంటారు. ఇలా రోజులో మనకు కావలసిన ఆహారం కంటే తక్కువ తినడం వల్ల నీరసం రావడం తో పాటు కడుపులో గ్యాస్ ఫామ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది.


బయట తినేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా హెల్తి ఫుడ్ తీసుకోవడానికీ కి ట్రై చేయండి. బ్రౌన్ రైస్ , బ్రౌన్ బ్రెడ్ , ఓట్ మీల్ వంటివి ప్రతి రోజు తీసుకోవాలి. వీటిలో ఎక్కువ న్యూట్రియన్స్ తో పాటు ఫైబర్ కూడా పుష్కలంగా లభిస్తుంది కాబట్టి, ప్రతిరోజు వీటిని తీసుకోవాలి. తినేటప్పుడు కేవలం తిండి మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి. ఇక మీకు నచ్చిన ఆహారాన్ని హెల్తీ గా ఉండేలా చూసుకుని మరీ తినడం అలవాటు చేసుకుంటే, ఎటువంటి గ్యాస్ సంబంధిత సమస్యలు దరిచేరవు.

మరింత సమాచారం తెలుసుకోండి: