
పుట్టగొడుగులు ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.
పుట్టగొడుగుల్లో ఉండే పాలీశాఖరైడ్ లు చర్మాన్ని డీ హైడ్రేట్ కాకుండా ఉండేలాగా చూస్తాయి. ఇక దీనితోపాటు ఇన్ఫెక్షన్స్ నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. ఇకపోతే పుట్టగొడుగుల్లో రోగనిరోధక శక్తి పెంచే పోషకాలు ఎక్కువగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడం వల్ల మనలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇక పుట్టగొడుగులు పొటాషియం కి మంచి మూలం అని చెప్పవచ్చు. ఇది శరీరంలో సోడియం యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించడంలో చాలా చక్కగా సహాయపడతాయి. ఇక రక్తనాళాలను సడలిస్తుంది. అలాగే రక్తపోటు నియంత్రణలో ఉండేలాగా పుట్టగొడుగులు కాపాడుతాయి. ముఖ్యంగా అధిక రక్తపోటుతో బాధపడేవారు తప్పకుండా వారంలో రెండుసార్లు ఇలా పుట్టగొడుగులను తింటూ ఉంటే అధిక రక్తపోటు సమస్య నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.
ఇక శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయి ని నియంత్రించడానికి పుట్టగొడుగులు చాలా బాగా సహాయపడతాయి. ఇందులో ఉండే బీటా గ్లూకాన్ ఒక రకమైన డైటరీ ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని పెంచడంలో ముందుంటుంది. పుట్టుకడుగుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ శరీరాన్ని దెబ్బతీసే రాడికల్స్ నుంచి మనల్ని రక్షించడమే కాకుండా గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి తీవ్రమైన సమస్యలకు దూరంగా ఉండడానికి సహాయపడతాయి.