విటమిన్ డి మన శరీరానికి అవసరమైన పోషకం. ఇది మన ఎముకలు, దంతాలను బలంగా చేస్తాయి. మన జీవనశైలి , ఆహారపు అలవాట్లు చాలా మందికి తమ శరీరంలో అవసరమైన విటమిన్ లోపాన్ని ఏర్పర్చుతాయి.విటమిన్ డి బలమైన ఎముకలకు అవసరమైన కాల్షియంను శరీరంలో నిలుపుకోవడంలో సహాయపడుతుంది. విటమిన్ డి లేకపోవడం వల్ల ఎముకల సాంద్రత తగ్గిపోతుంది. దీంతో ఎముకలలో పగుళ్లు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. ఎముకలు, కండరాలలో నొప్పి కలిగే అనుభూతి ఏర్పడుతుంది. ఈ విటమిన్ లోపం వల్ల మహిళల్లో వెన్ను నొప్పి సమస్య పెరుగుతుంది. శరీరంలో విటమిన్ డి లోపాన్ని తీర్చడానికి.. కొంతమంది విటమిన్ డి డైట్ తీసుకుంటారు. అలాగే విటమిన్ డి సప్లిమెంట్‌గా మాత్రలు తీసుకుంటారు.మనందరికీ రోజుకు 60-1000 IU విటమిన్ డి అవసరం. కానీ కొంతమంది ఈ విటమిన్‌ను అవసరానికి మించి తీసుకోవడం ప్రారంభిస్తారు. విటమిన్ డి అధికంగా తీసుకోవడం వల్ల కూడా శరీరానికి హాని కలుగుతుంది. విటమిన్ డి ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ఎలాంటి నష్టాలు కలుగుతాయో తెలుసుకుందాం.


శరీరంలో విటమిన్ డి అధికంగా ఉండటం వల్ల, దాహం ఎక్కువ అవుతుంది. మానవులలో డీహైడ్రేషన్ ప్రమాదం పెరుగుతుంది.మీరు విటమిన్ డి ఎక్కువగా తీసుకుంటే, నిర్ణయం తీసుకునే సామర్థ్యం దెబ్బతింటుంది. విటమిన్ డి ఎక్కువగా తీసుకునే వ్యక్తులు తరచుగా గందరగోళానికి గురవుతారు.విటమిన్ డి ఎక్కువగా తీసుకోవడం వల్ల మీరు అసౌకర్యానికి గురవుతారు. మీరు అలసిపోయినట్లు, మానసికంగా కలవరపడవచ్చు. విటమిన్ డి అధికంగా తీసుకోవడం మీ మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది.విటమిన్ డి ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. విటమిన్ డి ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం పరిమాణం పెరుగుతుంది. ఇది మలబద్ధకానికి దారితీస్తుంది. విటమిన్ డి ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, ఆకలి లేకపోవటం, వికారం, మలబద్ధకం వంటివి ఏర్పడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: