
బ్లాక్ క్యారెట్లు ఎక్కువగా పొటాషియం, ఫైబర్ ,విటమిన్స్, మాంగనీస్ ఇతర పోషకాలు సైతం పుష్కలంగా లభిస్తాయట.ఇందులో ఉండేటువంటి పోషకాలు శరీరానికి చాలా అవసరం కావున వీటిని తినడం మంచిదని ఆరోగ్య నిపుణులు సైతం తెలియజేస్తున్నారు.. సాధారణ క్యారెక్టర్ కంటే వీటిని తినడం వల్లే పలు రకాల ప్రయోజనాలు ఉన్నాయట. ముఖ్యంగా ఈ చలికాలంలో తినడం వల్ల షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తాయి.కళ్ళను కూడా చాలా మేలు చేసేలా చూస్తాయట. ఈ క్యారెట్ తింటే చూపుతో ఇబ్బంది పడుతున్న వారికి చాలా మేలు జరుగుతుందట.
గుండె సమస్యలతో ఉన్నవారు నల్ల క్యారెక్టర్ని తినడం మంచిది. ఇందు లో ఉండే అంతోసైనిన్ గుండెను చాలా దృఢంగా ఉండడానికి సహాయపడుతుంది. ఈ బ్లాక్ క్యారెట్ తినడం వల్ల కూడా రక్తాన్ని శుద్ధి చేస్తుందట. రక్తహీనత సమస్య తో ఇబ్బంది పడేవారు ఈ బ్లాక్ క్యారెట్లు తింటే మంచి ఫలితాలు వస్తాయట. బ్లాక్ క్యారెట్ ని ఎక్కువగా తిన్నా సరే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయట వీటిని తినడం వల్ల కొంత మందిలో అలర్జీ సమస్యలు కూడా వస్తాయి. అలాగే దురద, ముఖం వాయడం జీర్ణ సమస్యలు వంటివి కూడా ఎక్కువగా వస్తాయట. కొంత మందిలో మూత్రం రంగు కూడా మారుతుంది. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్నవారు వీటిని తినకపోవడమే మంచిది.