బంగాళాదుంపలు ఎక్కువగా తింటే కీళ్ల నొప్పులు వాతం చేస్తుంది అని కొంతమంది ఈ బంగాళాదుంపకి కొంచెం దూరంగా ఉంటారు.కాని అప్పుడప్పుడు తినడం వల్ల వచ్చే ఇబ్బంది ఎం ఉండదు అని అంటున్నారు కొంతమంది నిపుణులు.కొంతమంది అయితే బంగాళాదుంప తో ఎలాంటి రెసిపీ చేసిన ఏంతో ఇష్టంగా తింటారు.దుంప టమాట కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది. దుంపతో వేపుడు కూడా బాగుంటుంది.మరి ఈ దుంప ప్రియుల కోసం ఎప్పుడూ ఒకేలా కాకుండా ఓ కొత్త రెసిపీ చూసేద్దామా! ఈవెనింగ్ పిల్లలు స్కూల్ నుండి వచ్చే సరికి వేడి వేడి గా ఈ బంగాళాదుంపతో స్నాక్స్ చేసి పెడితే ఏంతో ఇష్టంగా తింటారు.మరి ఎలా తయారు చేయాలో చూద్దాం.


ఒక గిన్నెలో ఒక కప్ మైదా పిండిని తీసుకొని అందులో కొంచెం ఉప్పు హాఫ్ స్పూన్ వాము వేసి కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక నాలుగు బంగాలదుంపలు ఉడికించి పొట్టు తీసి సన్నగా తురుముకోవాలి.ఇందులో రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసుకొని,అందులోనే గరం మసాల పొడి, మిరియాల పొడి, వేసుకొని బాగా కలపాలి.తర్వాత రెండు ఉల్లిపాయ ముక్కలు,నాలుగు పచ్చిమిర్చి ముక్కలు,సన్నగా తరిగిన గుప్పెడు కరివేపాకు,కోత్తిమీర,రెండు టేబుల్ స్పూన్స్ మొక్కజొన్న పిండి వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని చపాత్తిల్లా చిన్న చిన్న గా రుద్దుకొని దాని పైన ఈ బంగాళాదుంప మిశ్రమాన్ని పెట్టి రౌండ్ గా బొండాల్ల చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో డీఫ్రై కి సరిపడా ఆయిల్ పోసుకొని బాగా కాగాక, ఈ బొండాలని వదిలి డీఫ్రై చేసుకోవాలి. మంచి బంగారు కలర్ వచ్చేవరకు డీఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం బొండాలని చేసుకుని ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకోండి. అంతే వేడి వేడి బంగాళాదుంపతో స్నాక్స్ రెడీ. దీన్ని టమాట సాస్ తో తింటుంటే బలే రుచిగా ఉంటుంది.పిల్లలు ఇష్టంగా తింటారు. మల్లీ మళ్ళీ చేసిపెట్టమని అడుగుతారు.టైం కూడా పెద్దగా పట్టదు.అందుకే ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా కొత్తగా ట్రై చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: