ఆహా ఏమి రుచి అనరా మైమరచి తాజా కూరలలో రాజా ఎవరంటే ఇంకా చెప్పాలా వంకాయ అని పాట ఊరకనే పాడలేదు. ఈ వంకాయలు చాలా రకాలు ఉన్నాయి. మనం ఇప్పుడు గుత్తి వంకాయని పళ్లీలు ఎండు కొబ్బరి వేసి గుత్తి వంకాయ కూర ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా హాఫ్ కేజీ మీడియం సైజ్ గుత్తి వంకాయలని తీసుకొని మధ్యకి చీల్చి తోడిమలతో పాటు సాల్ట్ వాటర్ లో వేసుకోవాలి.సాల్ట్ వాటర్ లో వంకాయలని ఎందుకు వేస్తారో తెలుసా? కాయ కోసిన వెంటనే నల్లగా మారుతుంది.అలా మారకుండా ఉండటానికి సాల్ట్ వాటర్ లో వేస్తారు.ఇకపోతే ఒక కడాయిలో ఒక కప్పు వేసుశెనగ గుళ్ళు,ఒక కప్పు ఎండుకొబ్బరి ముక్కలు, రెండు స్పూన్ లా ధనియాలు,నాలుగు ఎండుమిరపకాయలు,ఒక స్పూన్ పచ్చి సెనగ పప్పు వేసి వేపుకోని పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు మరో గిన్నెలో ఆయిల్ వేసి అందులో నాలుగు టమాటా ముక్కలు, రెండు ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా మగ్గనివ్వాలి.ఇప్పుడు మనం రోస్ట్ చేసి పెట్టుకున్న పళ్లీలు,కొబ్బరి, ధనియాలు, మొత్తం మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకొని,అదే మిక్సీ లో ఈ టమాటా ఉల్లిపాయ మిశ్రమాన్ని కూడా వేసి బాగా మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి.


ఇప్పుడు సాల్ట్ లో వేసిన వంకాయలని పక్కకి తీసుకుని వంకాయ మధ్యలోకి మనం ముందుగా పేస్ట్ చేసుకున్న పల్లీ పేస్ట్ ని బాగా పట్టించాలి.ఇప్పుడు మరో గిన్నెల్లో ఆయిల్ వేసి అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేవరకు వేగనివ్వాలి.తర్వాత మిగిలిన పల్లీ పేస్ట్ ని కూడా వేసి బాగా వేగనివ్వాలి.అందులోనే టమాట ఉల్లిపాయ పేస్ట్ ని కూడా వేసి బాగా మగ్గనివ్వాలి.ఇప్పుడు  కారం,పసుపు వేసి మరో రెండు నిముషాలు వేగనివ్వాలి.ఇప్పుడు ఇందులోనే మసాలా పట్టించుకున్న వంకాయలను వేసుకోవాలి.ఇందులో కొన్ని వాటర్ ఆడ్ చేసి రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా సన్నని మంట మీద ఉడకనివ్వాలి.కూర దగ్గర పడి ఆయిల్ పైకి తెలే వరకు ఉడికించుకోవాలి.చివరిగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోండి.అంతే ఘుమఘుమలాడే గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది.ఈ గుత్తి వంకాయ కరీ తింటుంటే చాలా రుచిగా ఉంటుంది. నిజంగానే అన్ని కూరకగాయలకి రాజు వంకాయే అనిపిస్తుంది.మరి మీరు కూడా ఈ గుత్తి వంకాయ కర్రీ పైన చెప్పిన విధంగా ట్రై చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి: