ప్రతి ఒక్కరూ తమ జుట్టు అందంగా పెరగాలని కోరుకుంటూ ఉంటారు. జుట్టు అందంగా పెరగడానికి రకరకాల ప్రయత్నాలను కూడా చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే ఇంటి చిట్కాలను పాటిస్తారు. మరికొందరు పెరుగు హెయిర్ మాస్కులతో జుట్టుని ఒత్తుగా మార్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. పెరుగులో గుడ్డు సోనా, ఆముదం కలిపి తలకు పట్టించి 20 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకోవాలి. దీనిని జుట్టుకు రాయడం వల్ల మృదువుగా మారుతుంది. కురులు బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి. కాబట్టి ఇది జుట్టుకి చాలా మంచిది. జుట్టు ఎక్కువగా రాలుతుందని బాధపడేవారు మిరియాల పొడి, పెరుగుతో తయారు చేసిన ఈ మాస్క్ ను ఉపయోగించవచ్చు. 

పెరుగు, నల్ల మిరియాలు పొడిని బాగా మిక్స్ చేసి తలకు పట్టించి... స్మూత్ గా మసాజ్ చేయండి. 10 నిమిషాలు అలాగే వదిలేయండి. ఇది తలలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. పెరుగులో నిమ్మరసం, మెంతుల పొడి కలిపి తలకు పట్టించాలి. దీనిని తలకు రాయడం వల్ల జుట్టు స్మూత్ గా ఉంటుంది. దురద, ఇరిడేషన్ సమస్య కూడా ఉండదు. పెరుగులో కొంచెం తేనే, కొంచెం ఆలివ్ ఆయిల్ కలిపి తలకు పట్టించాలి. దీనిని తలకు రాయడం వల్ల జుట్టు షైని గా మారుతుంది. అలాగే జుట్టు తేమ కలిగి ఉంటుంది. కొంచెం పెరుగులో కొంచెం కలబంద గుజ్జు, కొబ్బరి నూనె కలిపి తాలకు రాసుకోవాలి.

దీనిని తలకు అప్లై చేయడం వల్ల జుట్టు రాలిపోవడం, చిట్లిపోవడం లాంటి ఇబ్బందులు ఉండవు. షైనింగ్ గా ఉంటుంది. జుట్టు కుదుళ్ళు బలంగా, ఒత్తుగా ఉండాలంటే పెరుగును ఆలివ్ ఆయిల్, తులసి ఆకులు పొడి తో కలిపి ప్యాక్ తయారు చేసుకుని వాడండి. ఈ పదార్థాలన్నీ కావాల్సిన మోతాదులో తీసుకుని బాగా మిక్స్ చేసి తలకు పట్టించాలి. ఇది 30 నిమిషాల పాటు ఆరిన తరువాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల మీ జుట్టు మృదువుగా ఉంటుంది. పెరుగులో ఆపిల్ సడర్ వెనిగర్, నిమ్మరసం కలిపి తలకు పట్టిస్తే చింటూ సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చు. దురద, ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఉంటారు. పెరుగులో ఐదు చుక్కల టి ట్రి ఆయిల్, ఐదు చుక్కలు లావండర్ ఆయిల్ కలిపి తలకు రాసినట్లయితే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఆంటీ సెప్టిక్ గుణాలు కూడా ఉండడంతో బాగా పనిచేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: