
ఇది జీర్ణ రసాలను ఉత్పత్తి చేసి ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. జాజికాయలో యాంటి ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉండటంతో జ్వరం, జలుబు, మసుల నొప్పులు, కీళ్లనొప్పులపై ప్రభావాన్ని చూపుతుంది. నూనెలో కలిపి మర్దన చేస్తే నొప్పులు తగ్గుతాయి. జాజికాయ పొడిని తేనెతో కలిపి ముఖానికి మాస్క్ లాగా వేస్తే మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. చర్మం తాజాగా, మెరిసేలా ఉంటుంది. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మంపై మలినాలు పెరగకుండా చూస్తాయి. జాజికాయ వాసన బాగా ఉండటంతో దీనిని నోటి దుర్వాసన నివారించేందుకు ఉపయోగిస్తారు. దీనిలోని యాంటీ సెప్టిక్ గుణాలు నోటి లోపల హానికరమైన బ్యాక్టీరియాలను నాశనం చేస్తాయి. ఇది ముఖ్యంగా మహిళలలో హార్మోన్ల అసమతుల్యత వల్ల వచ్చే సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
మెనోపాజ్, మెన్స్ట్రువల్ పైన్ వంటి సమస్యలకు ఉపశమనం ఇస్తుంది. జాజికాయను రోజూ తక్కువ మోతాదులో తీసుకుంటే మెదడు శక్తి పెరుగుతుంది. నాడీవ్యవస్థ బలపడుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గించి, శాంతిని కలిగిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు హృదయ సంబంధిత సమస్యలను అడ్డుకుంటాయి. రక్తప్రసరణ మెరుగవుతుంది. హై బీపీ, కొలెస్ట్రాల్ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. జాజికాయ మనశ్శాంతికి ఉపయోగపడే నేచురల్ టానిక్ లాంటిది. దీన్ని తినడం వల్ల మూడ్ బూస్టింగ్, స్ట్రెస్ రిలీఫ్ లాంటి ప్రయోజనాలు లభిస్తాయి. జాజికాయ శరీరంలో టాక్సిన్లను తొలగించడంలో సహాయపడుతుంది. లివర్ ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తుంది. పాలు లేదా తేనెతో – రాత్రి నిద్రకు ముందు చిటికెడు జాజికాయ పొడి వేడి పాలలో కలిపి తాగాలి.