బీట్రూట్ అనేది సహజంగా తక్కువ కేలరీలు, అధిక పోషకాలు కలిగిన ఆహారం. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన సహాయకుడిగా మారుతుంది. అయితే, బీట్రూట్‌ను సరైన విధంగా తీసుకుంటే మాత్రమే దాని ప్రయోజనాలు మరింతగా అందుతాయి.ఉదయాన్నే ఖాళీ కడుపుతో బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. మెటబాలిజం పెరిగి కొవ్వు ద్రవీభవన వేగంగా జరుగుతుంది. నీరసం లేకుండా శక్తివంతంగా ఉండొచ్చు. సాయంత్రం స్నాక్స్ టైమ్‌లో జంక్ ఫుడ్ బదులు బీట్రూట్ సలాడ్ తినడం వల్ల తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ లభిస్తుంది. బీట్రూట్‌తో పాటు క్యారెట్, కీరా, ఉల్లిపాయ వంటి వాటిని కలిపి తింటే ఆకలి నియంత్రణలో ఉంటుంది. రాత్రి భోజనం స్థానంలో తక్కువ ఉప్పుతో బీట్రూట్ బాయిల్డ్ చేసి తినవచ్చు. అలా చేయడం వల్ల రాత్రి సమయంలో ఎక్కువ కేలరీలు దొరకకుండా నియంత్రణలో ఉంటాయ.

100 గ్రాముల బీట్రూట్‌లో కేవలం 43 కిలోకేలరీలే ఉంటాయి. ఎక్కువ తినినా బరువు పెరగదు. బీట్రూట్‌లో అధికంగా ఉండటం వల్ల దీర్ఘకాలంగా తిండిపట్ల ఆకలి రాదు. ఫలితంగా ఎక్కువ తినడం తగ్గుతుంది. బీట్రూట్‌లో ఉండే నైట్రేట్లు శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరచి, మెటబాలిక్ రేట్ పెంపొందిస్తాయి. ఇది కొవ్వు ద్రవీకరణానికి దోహదపడుతుంది. బీట్రూట్‌లోని అంథోసయానిన్స్, బెటలైన్స్ లివర్‌ను శుభ్రపరచడంలో సహాయపడతాయి. ఇది బరువు తగ్గే ప్రక్రియకు ఉపశమనంగా మారుతుంది. బీట్రూట్‌లో ఐరన్, ఫోలేట్ అధికంగా ఉండడం వల్ల అనీమియా నివారించబడుతుంది. ఆరోగ్యంగా బరువు తగ్గేందుకు ఇది చాలా అవసరం. రోజుకు 1 బీట్రూట్‌ మాత్రమే తినాలి. ఎక్కువగా తీసుకుంటే గ్యాస్ లేదా మూత్ర రంగు మార్పులు కలగవచ్చు.

షుగర్ ఉన్నవారు బీట్రూట్‌ తీసుకునే ముందు డాక్టర్ సలహా తీసుకోవాలి. రాత్రిపూట ఎక్కువగా తీసుకోరాదు – జీర్ణ సమస్యలు కలగవచ్చు. బీట్రూట్ + గాజర్ జ్యూస్ కాయ పచ్చడితో మిశ్రమ బీట్రూట్ సలాడ్నూ. నె తక్కువగా ఉన్న వేపుడు కూరలతో పాటు రోటీ / బ్రౌన్ రైస్, బీట్రూట్‌ను సరైన సమయంలో, సరైన మోతాదులో తీసుకుంటే ఇది బరువు తగ్గడంలో ఖచ్చితంగా సహాయపడుతుంది. ఇది మంచి పోషకాహారంగా ఉండటంతో పాటు, శరీరంలోని మలినాలను తుడిచిపెట్టే శక్తి కలిగి ఉంటుంది. జంక్‌ఫుడ్‌కి బదులు బీట్రూట్‌ను రోజువారీ ఆహారంగా మార్చుకోండి. కొన్ని వారాల్లోనే తేడా కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: