సూర్యరశ్మి ప్రభావం వల్ల చర్మం ముదురు కావడం అనేది చాలా మందిని వేధించే సాధారణ సమస్య. బయట తిరిగే వాళ్లకి ఇది ముఖ్యంగా ఎక్కువగా ఎదురవుతుంది. అయితే, స్కిన్ ట్యాన్ తొలగించేందుకు ఇంట్లోనే సులభంగా పాటించగల కొన్ని అద్భుతమైన బ్యూటీ టిప్స్ ఉన్నాయి. ఇవి సహజమైనవి, రసాయనాలేమీ లేవు, చర్మానికి హానికరం కానివి. నిమ్మరసం + తేనె మిక్స్, 1 టీస్పూన్ నిమ్మరసం, 1 టీస్పూన్ తేనె కలిపి మిశ్రమం తయారు చేయండి. ఈ మిశ్రమాన్ని ట్యాన్ అయిన భాగాలకు అప్లై చేసి 15 నిమిషాలు ఉంచండి. ఆ తర్వాత కూల్ వాటర్‌తో కడగాలి. నిమ్మరసం లో ఉన్న సిట్రిక్ యాసిడ్ చర్మాన్ని తెలుపుగా చేస్తుంది. తేనె చర్మాన్ని నెమ్మదిగా మృదువుగా ఉంచుతుంది. పాలు + పసుపు మిశ్రమం, 2 టీస్పూన్లు మేలికలపిన పాలు, చిటికెడు పసుపు కలిపి పేస్ట్ చేయండి. ముఖానికి మరియు చేతులకు అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత నీటితో కడగండి.

పాలు చర్మాన్ని తేమగా ఉంచుతుంది. పసుపు యాంటీ బాక్టీరియల్ గుణాలు కలిగి ఉండి చర్మాన్ని శుభ్రపరుస్తుంది. బసన్ ఫేస్ ప్యాక్,  2 టీస్పూన్లు శనగపిండి. చిటికెడు పసుపు, కొద్దిగా నిమ్మరసం లేదా పెరుగు,ఈ మిశ్రమాన్ని పేస్ట్‌లా చేసి ముఖానికి లేదా చేతులకు రాసి 20 నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత మెల్లగా మసాజ్ చేస్తూ కడగాలి. ఇది చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేసి, ట్యాన్ తొలగించేందుకు బాగా ఉపయోగపడుతుంది. బొప్పాయి + నిమ్మరసం, బొప్పాయి ముక్కలు ముద్దలా చేసి అందులో కొద్దిగా నిమ్మరసం కలపండి. ముఖానికి లేదా ట్యాన్ వచ్చిన చోట రాసి 15 నిమిషాలపాటు ఉంచండి. నీటితో కడగండి. బొప్పాయిలో పాపేన్ అనే ఎంజైమ్ ఉండి చర్మాన్ని పునరుద్ధరించే శక్తి కలిగిస్తుంది. అలోవెరా జెల్, తాజా అలోవెరా ఆకును తీసుకుని మధ్య నుంచి జెల్ తీసి రాత్రి పడుకునే ముందు ట్యాన్ వచ్చిన చోట రాసి పెట్టాలి. తెల్లవారిన తర్వాత కడగాలి.

చర్మాన్ని చల్లగా ఉంచి ట్యాన్ తగ్గిస్తుంది. కొత్త స్కిన్ సెల్స్‌కి ఉత్తేజన ఇస్తుంది. టమోటా రసం, టమోటా రసాన్ని నేరుగా చర్మంపై రాసి 15 నిమిషాల తర్వాత కడగాలి. ఇది ట్యాన్ తో పాటు చర్మం పై ఉన్న మురికి, డార్క్ స్పాట్స్‌ను తగ్గించుతుంది. ట్యాన్ ఉన్నచోట దురుసుగా స్క్రబ్ చేయడం చర్మాన్ని మరింత దెబ్బతీయొచ్చు. తేలికగా మసాజ్ చేసే ప్యాక్స్ మాత్రమే వాడాలి. సన్ స్క్రీన్ తప్పక వాడాలి, బయటకు వెళ్లేటప్పుడు SPF 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న సన్‌స్క్రీన్ అప్లై చేయాలి. ప్రతి 2 గంటలకు రీయాప్లై చేయాలి. రోజుకు కనీసం 3 లీటర్ల నీరు తాగితే చర్మం బాగా మృదువుగా, ఆరోగ్యంగా ఉంటుంది. ఆహారంలో విటమిన్ C అధికంగా ఉండే ఫలాలు తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: