
ఇది శరీరంలో హీమోగ్లోబిన్ స్థాయిని పెంచడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా మహిళలకు ఇది ఎంతో ప్రయోజనకరం. వంకాయలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతో, శరీరంలో ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గించి వృద్ధాప్య లక్షణాలు ఆలస్యంగా వస్తాయి. చర్మం కాంతివంతంగా ఉండేందుకు సహాయపడుతుంది. వంకాయలో కాలొరీస్ తక్కువగా ఉంటాయి, కానీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది పొట్ట నిండిపోయిన ఫీలింగ్ ఇస్తుంది, అధికాహారాన్ని నివారిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వంకాయలోని పాలీఫెనాల్స్ శరీరంలోని కణజాలాలను రక్షించే శక్తిని కలిగి ఉంటాయి. కొన్ని పరిశోధనల ప్రకారం, ఈ పదార్థాలు క్యాన్సర్ కణాల వృద్ధిని అడ్డుకుంటాయి. ముఖ్యంగా కాలేయం, మెదడు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
అనే యాంటీఆక్సిడెంట్ మెదడులోని న్యూమాన్స్‌ను ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుండి రక్షిస్తుంది. మెదడు కణాలకు అవసరమైన పోషకాలను సరఫరా చేయడంలో సహాయపడుతుంది. మతిమరుపు వంటి సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది. వంకాయలో అధికంగా ఉండే ఫైబర్ పేగుల లోపల మంచి బ్యాక్టీరియా పెరిగేందుకు సహాయపడుతుంది. కొవ్వు పదార్థాలను పేగుల నుంచి బయటకు పంపిస్తుంది. గ్యాస్, కబ్జం సమస్యలను నివారించవచ్చు. వంకాయలోని పొటాషియం రక్త నాళాలను విస్తరించటంతో బిపి తగ్గుతుంది. ఇది హైపర్‌టెన్షన్ ఉన్నవారికి ఒక సహజ ఔషధంలా పనిచేస్తుంది. వంకాయలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వలన రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో ఉపయోగకరం.