ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమ అంటే కుళ్లుకునేవారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నంత కమేడియన్స్ మరే ఇండస్ట్రీలోనూ లేరు. ఎంతమంది కమెడియన్స్ ఉన్నా కూడా అందరూ కలిసి మెలిసి నటించేవారు. కానీ ఇప్పుడు అంతమంది కమెడెయిన్స్ తెరపై కనిపించడం లేదు. చాలామంది ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోతే.. కొందరు వెండితెరకు దూరమయ్యారు.

ఒకప్పుడు స్టార్ కమెడియన్స్ గా వెలుగొందిన బ్రహ్మానందం, కష్ణభగవాన్ వంటి వారు తెలుగు తెరకు దూరమయ్యారు. ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన వేణుమాధవ్, జయప్రకాశ్ రెడ్డి, ఏవీఎస్, ధర్మవరపు సుబ్రమణ్యం, ఎమ్మెస్ నారాయణ, కొండ వలస వంటి కమెడియన్స్ కన్నుమూశారు.
ప్రతి సినిమాలోనూ కనిపించిన బ్రహ్మానందం.. ఇప్పుడు వెండితెరపై పెద్దగా కనిపించడం లేదు. ఒకప్పుడు బ్రహ్మానందం లేకుండా సినిమా ఊహించుకోలేకుండా ఉండేది. ప్రతి హీరో సినిమాల్లో కచ్చితంగా బ్రహ్మానందం ఉండేవాడు. అలాంటిది ఏదో మరీ స్టార్ హీరోలు పట్టుబట్టిన సినిమాలు తప్ప మరే ఛాన్స్ లు రావడం లేదు. సీనియర్ హీరోలు, స్టార్ హీరోలు పరిచయం కొద్దీ బ్రహ్మానందం కావాలని అడుగుతున్నారు తప్ప .. ఇప్పటి దర్శకులు అసలు బ్రహ్మానందాన్ని పట్టించుకోవడం లేదు.

బ్రహ్మానందం స్థానాన్ని ఇప్పుడు వెన్నలకిషోర్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, సప్తగిరి వంటి వారు భర్తీ చేశారు. ఒకానొక టైం లో ఏడాదికి 25 సినిమాలు చేసిన బ్రహ్మి.. ఇప్పుడు డైరీ మొత్తం ఖాళీగానే ఉంటుంది. కృష్ణ వంశీ దర్శకత్వంలో రంగ మార్తాండ సినిమాలో సీరియస్ పాత్రలో చేస్తున్నాడు.

సెటైర్ లు వేసే కృష్ణ భగవాన్ కూడా అరకొర సినిమాలు తప్పిస్తే వెండితెరపై పెద్దగా కనిపించడం లేదు. ఎల్బీ శ్రీరామ్ కూడా షార్ట్ ఫిల్మ్స్ పై ఫోకస్ చేశాడు. సీనియర్ కమెడియన్ రఘుబాబు కూడా అప్పుడప్పడు కనిపించడమే తప్ప.. రెగ్యులర్ గా కనిపించడం లేదు. ఐదేళ్ల కిందట చక్రం తిప్పిన 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీకి పెద్దగా అవకాశాలు రావడం లేదు. మరో స్టార్ కమెడియన్ అలీ కూడా బుల్లితెరపై ఫోకస్ చేశాడు. అప్పుడప్పుడు చిన్న చిన్న పాత్రలు తప్ప ముందులాగా పెద్ద పాత్రలు చేయడం లేదు. సీనియర్ కమెడియన్ల స్థానాలను యంగ్ కమెడియన్లతో భర్తీ చేస్తున్నారు దర్శకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: