మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా తెలుగు చని ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విశ్వక్ సేన్ ఇప్పటికే పలు విజయవంతమైన మూవీ లలో హీరో గా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు ను దక్కించుకున్నాడు. ఇప్పటికే విశ్వక్ సేన్ ఈ సంవత్సరం రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. విశ్వక్ సేన్ ఈ సంవత్సరం మొదట గా అశోకవనంలో అర్జున కళ్యాణ మూవీ తో ప్రేక్షకులను పలకరించగా , తాజాగా ఓరి దేవుడా మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం విశ్వక్ సేన్ "దమ్కి" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. అలాగే ఈ మూవీ కి విశ్వక్ సేన్ దర్శకత్వం కూడా వహిస్తున్నాడు. ఈ మూవీ లో నివేదా పేతురాజ్  హీరోయిన్ గా నటిస్తోంది. 

ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి ఫస్ట్  సాంగ్ ను డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. తాజాగా దమ్కి మూవీ యూనిట్ ఈ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ ను డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయడం లేదు అని , కొంచెం డిలే అవుతుంది అని , ఈ మూవీ నుండి ఫస్ట్ సింగిల్ ను డిసెంబర్ 6 వ తేదీన సాయంత్రం 4 గంటలకు విడుదల చేబోతున్నాము అని తెలియజేస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి చిత్ర బృందం ఒక టీజర్ ను విడుదల చేయగా , ఆ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: