ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాలు హవా ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమ అభిమాన హీరోతో పాటు మరో స్టార్ హీరో నటిస్తూ ఇక మల్టీ స్టారర్ గా  ప్రేక్షకుల ముందుకు వస్తుండడంతో ప్రేక్షకులు కూడా విశేషమైన ఆదరణ అందించి సినిమాలను హిట్ చేస్తున్నారు అని చెప్పాలి. అదే సమయంలో భారీ మల్టీస్టారర్ గా వచ్చి చివరికి బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే 2022 ఏడాది ముగుస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది  మల్టీస్టారర్ గా వచ్చి బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన సినిమాలు ఏవో అన్నది ఆ టాపిక్ గా మారింది. వివరాలు చూసుకుంటే..

 బంగార్రాజు  : ఈ ఏడాది ఆరంభంలోనే అక్కినేని మల్టీ స్టారర్ బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేసింది. నాగార్జున ఆయన తనయుడు నాగచైతన్య కలిసి సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు సినిమాలో నటించారు. జనవరి 14న సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా హిట్టు కొట్టింది.

 త్రిబుల్ ఆర్  : బాహుబలి వరల్డ్ వైడ్ హిట్ తర్వాత జక్కన్న చెక్కిన కళాఖండం త్రిబుల్ ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా బ్లాక్బస్టర్ సాధించి.. ఎన్నో అవార్డులను కూడా సాధించే పనిలో ఉంది.

 భీమ్లా నాయక్  : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కలిసి నటించిన భీమ్లా నాయక్ సూపర్ హిట్ అయింది. సితార ఎంటర్టైర్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన  ఈ సినిమా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 ఎఫ్ త్రీ  : నవ్వుల సునామీగా సెన్సేషన్ హిట్ సాధించిన ఎఫ్2కి సీక్వెల్ గా వచ్చిన ఎఫ్3 సినిమా సినిమా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. అయితే ఇక ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది.


 గాడ్ ఫాదర్ :  ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత మరోసారి ప్రేక్షకులు ముందుకు వచ్చారు చిరంజీవి. మలయాళ సూపర్ హిట్ అయిన లూసిఫర్కు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కగా.. సినిమాలో చిరంజీవితో పాటు అటు సల్మాన్ ఖాన్ కూడా కీలకపాత్రలో నటించారు. అక్టోబర్ 5న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది.

 ఓరి దేవుడా : యువ హీరో విశ్వక్సేన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఓరి దేవుడా సినిమా మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ దేవుడు పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. అక్టోబర్ 21న విడుదలైన ఈ సినిమా ఇక యూత్ ని బాగా ఆకర్షించి మంచి విజయాన్ని సాధించింది అని చెప్పాలి.

 ఆచార్య  : ఈ ఏడాది భారీ మల్టీ స్టారర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆచార్య సినిమా ఎందుకో అంచనాలను అందుకోలేక డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఆయన తనయుడు చరణ్ కలిసి నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: