
అయితే ఈ షోను హోస్ట్ చేసే విషయంలో విజయ్ ఇప్పటివరకు ఒక స్థిర నిర్ణయానికి రాలేదని అందువల్ల అతడి అంగీకారం ఇంకా పెండింగ్ లో ఉంది అని అంటున్నారు. విజయ్ కాకుంటే రానా పేరు పరిసీలిస్తున్నప్పటికీ అతడికంటే ‘అన్ ష్టాపబుల్’ షోతో యూత్ కు బాగా దగ్గర అయిన బాలకృష్ణ పేరు కూడ స్టార్ మా యాజమాన్యం పరిశీలనలో ఉంది అని అంటున్నారు.
లేటెస్ట్ గా విడుదలైన ‘వీరసింహారెడ్డి’ మూవీ కలక్షన్స్ బాలయ్య కెరియర్ లో ఇప్పటివరకు ఎరుగని స్థాయిలో వచ్చాయి అన్నప్రచారం జరుగుతున్న పరిస్థితులలో ప్రస్తుత తరం యూత్ లో బాలయ్యకు పెరిగిన మ్యానియా ‘బిగ్ బాస్’ షోకు కలిసి వస్తుందని స్టార్ అంచనా అని తెలుస్తోంది. దీనికితోడు బాలకృష్ణ జోక్స్ వేసి నవ్వించడండంలో దిట్ట కాబట్టి అతడి హాస్య చతురత ఈషో విజయానికి అన్ని విధాల సహకరిస్తుందని స్టార్ మా యాజమాన్యం ఒక అంచనాకు వచ్చిందని మరికొందరు అంటున్నారు.
అయితే ఈవిషయమై మరొక వాదన వినిపిస్తోంది. గతంలో ఈ షోను హోస్ట్ చేసి విజయవంతంగా నడిపించిన జూనియర్ ఎన్టీఆర్ చేతిలో ఈ షోను పెడితే రేటింగ్స్ విషయంలో ఎదురు ఉండదని మరొక అంచనా స్టార్ మా కు ఉన్నట్లు టాక్. ఇన్ని ఆలోచనల మధ్య చివరకు ఈ షోను ఎవరు హోస్ట్ చేస్తారు అన్నది ప్రస్తుతానికి ఎవరికీ తెలియని విషయం..