సగటు మనిషి జీవించినంత కాలం ఎప్పుడు ఎలా జీవించినా పెద్దగా సమస్య ఉండదు..కానీ చనిపోయే చివరి రోజుల్లో మాత్రం తప్పకుండా ఆనందంగా జీవించాలని మాత్రం అనుకోవడంలో ఎటువంటి తప్పు లేదు.. ఎందుకంటే జీవితం అనే ఒక సముద్రాన్ని ఈదుతూ.. ఎన్నో బాధ్యతలు మీద వేసుకొని కుటుంబాన్ని నడిపిస్తాడు.. అలాంటి వ్యక్తి విశ్రాంతి తీసుకునేది కేవలం చివరి రోజుల్లో మాత్రమే.. కాబట్టి ఎవరైనా సరే చివరిరోజుల్లో ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులకు నోచుకోకుండా సంతోషంగా జీవించాలని అనుకుంటారు.. అలా అనుకునే వారిలో మీరు కూడా ఒకరైతే ఇప్పుడు చెప్పబోయే ఈ సరికొత్త పెన్షన్ స్కీమ్ ద్వారా భార్య భర్త ఇద్దరూ పదివేల రూపాయలను పొందవచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం..

కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం అందించే ఎన్నో రకాల స్కీం లలో అటల్ పెన్షన్ యోజన స్కీమ్ కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. అంతేకాదు ఈ స్కీం ద్వారా ఎంతో మంది వృద్ధులు, తమ చివరి కాలంలో ఎంతో సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు.. ఇందులో డబ్బులు సెక్యూర్ గా ఉండడంతో పాటు మెచ్యూర్డ్ కాలం ముగిసిన తర్వాత కచ్చితంగా డబ్బులు వస్తాయి. ఇందులో 18 నుంచి 40 సంవత్సరాల వయసు కలిగిన వారు చేరవచ్చు. 60 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మీకు పెన్షన్  రూపంలో అటల్ పెన్షన్ యోజన పథకం ద్వారా ప్రతి నెలా కొంత మొత్తం వస్తుంది..

ఇక ఇందులో మీరు కనుక చేరాలి అనుకుంటే.. ఈ పథకంలో చేరవచ్చు. ఇందులో భార్యాభర్తలు ఇద్దరూ చేయడంతో నెలకు పదివేల రూపాయలు పెన్షన్ రూపంలో వస్తాయి.అది ఎలా అంటే 20 సంవత్సరాల వయసులో భార్యాభర్తలిద్దరూ, ఈ పథకంలో చేరితే.. నెలకు 500 రూపాయలను చెల్లించడం వల్ల  60 సంవత్సరాలు పూర్తయిన తర్వాత.. ప్రతి నెల ఒక్కొక్కరికి ఐదు వేల చొప్పున ఈ పథకం  ద్వారా పొందవచ్చు.. నెలకు భార్య 248 రూపాయలు అలాగే భర్త 248 రూపాయలు కట్టడం వల్ల ప్రతినెల 10,000 రూపాయలు పెన్షన్ గా పొందవచ్చు.




మరింత సమాచారం తెలుసుకోండి: