జీవితంలో సంతోషంగా బ్రతకాలంటే అందరికీ కావాల్సింది డబ్బు ఒక్కటే. అయితే ఈ డబ్బు కోసం అందరూ ఎన్నో విధాలుగా కష్టాలు పడి సంపాదిస్తారు. డబ్బులు అయితే సంపాదిస్తారు కానీ... వాటిని ఎలా జాగ్రత్త పరుచుకోవాలో తెలియక ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటూ సమస్యల వలలో చిక్కుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ సమస్య అల్లా డబ్బులను వృదా ఖర్చులకు వినియోగించి ఉన్నదంతా వాడేయడమే ఇలా సంపాదించింది అంతా జల్సా ఖర్చుల కోసం, ఆర్భాటాల కోసం డబ్బును వృదా చేస్తూ పోతే ఎంత సంపాదించినా అస్సలు మిగలదు. పైగా అప్పులు పాలు కావాల్సి వస్తుంది.

ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే బయట వారు ఇదేంటి వీరు ఇంత సంపాదిస్తున్నా అప్పులు కావడం ఎంటి..?? ఇలా ఇబ్బందులు పడటం ఏంటి అంటూ బయట వారు కూడా మిమ్మల్ని తక్కువ చేసి చూస్తారు.
అందుకనే ప్రతి మనిషి డబ్బును సంపాదించడం ఆ తరవాత దాన్ని ఎలా ఖర్చు చేయాలి అని ఆలోచిస్తూ నచ్చింది చేసేయడం కాదు. సంపాదించిన దాంట్లో కొంతైనా దాచుకోవడం అలవాటు చేసుకోవాలి. తింటూ కూర్చుంటే కొండ అయినా కరిగిపోతుంది. అలాగే ఖర్చు చేస్తూ పోతే ఎంత సంపాదించినా అస్సలు మిగలదు అన్న విషయాలను గుర్తు పెట్టుకోవాలి. ఏ చెట్టుకు అంత గాలి అన్నట్లు ప్రతి నెల సంపాదించిన దాంట్లో కొంత డబ్బును పక్కన పొదుపు చేసుకోవాలి .

ఒక వేళ మీ చేతిలో ఉంటే చిన్న చిన్న అవసరానికి కూడా ఖర్చు చేసేస్తాం అనుకుంటే నమ్మకమైన చీటీలు కట్టు కోవడం, పోస్ట్ ఆఫీస్ లో ఫిక్స్డ్ డిపాజిట్ లు చేసుకోవడం వంటివి చేయడం ఉత్తమం. కాబట్టి రోజు రోజుకు పెరుగుతున్న ఖర్చులను మరియు ఆర్ధిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఒక ప్రణాళిక ప్రకారం డబ్బును ఖర్చు చేయడం మరియు ఆదా చేయడం నేర్చుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: