
జీవన్ ఉమాంగ్ ఇన్సూరెన్స్ పాలసీ.. అత్యుత్తమ రిటర్న్ ప్లాన్లలో ఇది కూడా ఒకటి. ఎల్ఐసి ఈ పాలసీతో 100 సంవత్సరాల వయసు వరకు పాలసీదారుడు పొందుతారు. ముఖ్యంగా ఈ ప్లాన్ కుటుంబ ఆర్థిక కవరేజీ కోసం ఆదాయం, పొదుపులు వంటి ప్రయోజనాలతో లభిస్తుంది. కస్టమర్లు వార్షిక, అర్థ వార్షిక, త్రైమాసిక లేదా నెలవారి కూడా ప్రీమియం చెల్లించే అవకాశాన్ని ఈ పథకం ద్వారా పొందవచ్చు. ముఖ్యంగా పాలసీదారు చివరికి హామీ మొత్తం చెల్లింపులో పొందుతాడు.
ఎల్ఐసి కొత్త జీవన్ శాంతి ప్రణాళిక పాలసీ.. ఈ పాలసీ మీకు మంచి రిటర్న్ పాలసీ అని చెప్పవచ్చు. 30 ఏళ్ల నుంచి 79 ఏళ్ల లోపు వారు ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. ముఖ్యంగా రూ.5లక్షలు లేదా అంతకంటే ఎక్కువ యాన్యుటీ ఇక్కడ పొందే అవకాశం ఉంటుంది. ఇక ఇన్వెస్టర్లు ఈ ప్లాన్ లో కనీసం రూ.1.5 లక్షల రూపాయలను పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. అయితే గరిష్ట పెట్టుబడి మొత్తానికి ఎటువంటి పరిమితి లేదని చెప్పవచ్చు. ముఖ్యంగా సింగిల్ లైఫ్ జాయింట్ లైఫ్ కోసం డిఫర్డ్ యాన్యుటీ ఆప్షన్ తో ఈ పథకం వస్తుంది.