ఈమధ్య ప్లాస్టిక్ వాడకాన్ని సైతం ప్రభుత్వాలు నిషేధించాలంటు తెలియజేస్తున్నారు.అందుకే గతంలో ఎక్కువగా ప్లాస్టిక్ కవర్లు కనిపిస్తూ ఉండేవి కానీ ఈ మధ్య ప్లాస్టిక్ గ్లాసెస్ కూడా చాలా తక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. ఇలా ప్లాస్టిక్ వంటి వాటిపైన నిషేధం రావడంతో కాగితంతో తయారుచేసిన వస్తువులకు సైతం భారీ డిమాండ్ పెరుగుతోంది. మార్కెట్లో పేపర్ ప్లేట్స్ గ్లాస్ పేపర్ బ్యాగ్స్ వంటి వాటికి కూడా మంచి డిమాండ్ ఉన్నది. ఈమధ్య ఏదైనా చిన్న ఫంక్షన్ జరిగిన ఎక్కువగా వీటిని ఉపయోగిస్తూ ఉంటున్నారు.

పెళ్లిళ్లు పుట్టినరోజు శుభకార్యాలకు సైతం ఎక్కువగా పేపర్ ప్లేట్స్ ను ఉపయోగించడం ఆనవాయితీగా మారుతోంది. అయితే పర్యావరణానికి సైతం హాని కలిగించని ఇలాంటి పరిశ్రమలకు సైతం భారీ డిమాండ్ ఉన్నదని చెప్పవచ్చు. కేవలం ఇంట్లోనే ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాలను సైతం మొదలు పెట్టవచ్చని చెప్పవచ్చు. ఖాళీగా ఉన్న సమయాలలో ఇలాంటి పేపర్ ప్లేట్లను మనం తయారు చేసుకుని ఈ వ్యాపారాన్ని సైతం మనం ప్రారంభించుకోవచ్చు. అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చే వ్యాపారం ఇది ఒకటిని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.


చాలామంది ఇలాంటి బిజినెస్ లను మొదలుపెట్టి ఇతర ప్రాంతాలలో మన తెలుగు రాష్ట్రాలలో కూడా భారీగా ఆదాయాన్ని పొందుతున్నట్లు తెలుస్తోంది. అయితే మనం పెట్టుబడి పెట్టే వాటిని పట్టే ఆదాయం ఉంటుందట. పేపర్ క్వాలిటీ ప్రింటెడ్ మిషన్ తోపాటు ఇతరత్రా వాటిని తీసుకోవలసి ఉంటుంది ముడి సరుకులు కూడా కొనుగోలు చేసుకోవాలి చిన్న యంత్రం ద్వారా ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తే నెలకు 25 వేల రూపాయలు ఆదాయం వస్తుందట. పెద్ద మిషన్ అయితే 55 వేల రూపాయల నుంచి లక్ష వరకు ఆదాయం వస్తుందని తెలుస్తోంది. అయితే ఈ వ్యాపారానికి సైతం అవసరమైనటువంటి లైసెన్సులను ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తయారు చేసిన వాటిని అమ్మడం వల్ల భారీ సంపాదన వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: