ప్రస్తుతం పురుషులతో సమానంగా మహిళలు కూడా అన్నిటిలో రాణిస్తున్నారు.. ముఖ్యంగా ఉద్యోగ విద్య బిజినెస్ పరంగా కూడా భారీగానే రాణిస్తున్నారు.. అందుకే కేంద్ర ప్రభుత్వం మహిళలకు సైతం తాజాగా ఒక శుభవార్తను అందిస్తోంది. వ్యాపారం చేసుకోవాలనుకునే మహిళలకు యువజన పథకం కింద బ్యాంకు నుండి రుణాలను సైతం పొందవచ్చు.. ఉద్యోగిని యువజన ప్రభుత్వ 30 శాతం వరకు సబ్సిడీ అందిస్తుందట. ఈ పథకం కింద గరిష్టంగా మూడు లక్షల రుణాన్ని కూడా పొందవచ్చు.. 18 నుంచి 55 ఏళ్ల మధ్య ఉన్న మహిళలు సైతం ఈ పథకానికి అర్హులు. ఈ బ్యాంకు రుణాన్ని ఎలాంటి హామీ లేకుండానే పొందవచ్చు.. అయితే ఈ పథకానికి మాత్రం కొన్ని షరతులు ఉన్నాయి వాటి గురించి చూద్దాం.


ఎవరైనా మహిళ కుటుంబ ఆదాయం.. రూ.1.5 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉండాలి వితంతువులు మరియు వికలాంగుల మహిళలకు సైతం ఆదాయ విషయంలో ఎలాంటి పరిమితి ఉండదు.. ఈ లోన్ కోసం మీరు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు కూడా చేయాల్సిన పనిలేదు.. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, కుల ధ్రువీకరణ పత్రం వంటివి మాత్రమే అందించాల్సి ఉంటుంది. సాధారణంగా మీరు తీసుకున్న రుణం కంటే కాస్త ఎక్కువగానే చెల్లించాలి.. ఈ పథకంలో ప్రభుత్వం మీకు సబ్సిడీ కూడా ఇస్తుంది.


ఏదైనా ప్రభుత్వ రంగం బ్యాంకుకు వెళ్లి ఉద్యోగుల పథకం కింద రుణాన్ని తీసుకున్నట్లయితే పత్రాలు సమర్పించి పొందవచ్చు. ఈ స్కీం కోసం దరఖాస్తుకు కావలసినటువంటి డాక్యుమెంట్లు బ్యాంకుకు సైతం సమర్పించాలి. ఉద్యోగి ప్రోగ్రాం కింద రుణం ఇచ్చేటువంటి బ్యాంకులను సైతం అధికారికంగా వెబ్సైట్లను కూడా సంప్రదించి ఆన్లైన్లో కూడా మనం అప్లై చేసుకోవచ్చు.. అయితే కేంద్ర ప్రభుత్వం కేవలం మహిళలకు మాత్రమే ఇలాంటి సదుపాయాలను కల్పిస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం దగ్గర్లోని ఏదైనా బ్యాంకుకు వెళ్లి కనుక్కోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: