దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థలలో ఒకటైన ఎల్ఐసి ప్రజల కోసం ఎన్నో రకాల పథకాలను కూడా ప్రవేశ పెడుతూ వస్తోంది. ముఖ్యంగా మహిళల కోసం ఆడపిల్లల కోసం పలు రకాల పథకాలను అందుబాటులో ఉంచింది.. ఇంట్లో ఆడపిల్లలు ఉంటే వారి వివాహానికి.. చదువుల గురించే తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా పెరిగిన ధరల వల్ల చాలామంది తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇలాంటి వారి కోసమే ఎల్ఐసి ఒక సూపర్ ప్లాన్ ని తీసుకువచ్చింది.. అదే ఎల్ఐసి కన్యాదాన పాలసీ..


ఇందులో నెలకు కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయడం వల్ల ఆమె పెళ్లినాటికి లక్షల రూపాయల సైతం ఆదాయాన్ని తీసుకోవచ్చు. ఈ పాలసీ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.. ఈ పాలసీ తీసుకోవాలంటే ఖచ్చితంగా 30 ఏళ్లు ఉండాలి.. పాపకి కూడా ఒక ఏడాది వయసు కలిగి ఉండాలి.. ఎల్ఐసి కన్యాదాన పాలసీ 25 సంవత్సరాలు అయినప్పటికీ ఇందులో మీరు 22 ఏళ్ళు ప్రీమియం చెల్లించాలి.. మిగిలిన 3 సంవత్సరాలు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన పని ఉండదు..


అమ్మాయి వయసు బట్టి మెచ్యూరిటీ సమయాన్ని మనం పెంచుకునే అవకాశం ఉంటుంది. ఈ పాలసీని తీసుకోవాలనుకునే వారు కచ్చితంగా జనన దృవీకరణ పత్రంతో పాటు తల్లితండ్రుల ఆధార్ కార్డు పాన్ కార్డు పాస్ ఫొటోలు ,బ్యాంకు పాస్బుక్ ను కలిగి ఉండాలి.. పాలసీ కన్యాదాన పాలసీ విషయానికి వస్తే పాలసీలో రోజుకు రూ .151 రూపాయలు చెల్లించవచ్చు. లేకపోతే నెలకు రూ.4530 రూపాయల పొదుపు చెల్లించాలి.. ఇలా 22 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లించాలి.. ఆ తర్వాత మూడేళ్ల తర్వాత రూ.31 లక్షల రూపాయలను పొందుకోవచ్చు. దీంతో అమ్మాయి భవిష్యత్తుకి ఈ డబ్బు మొత్తం సరిపోతుంది.. లేకపోతే మరొక విదంగా రూ.121 డిపాజిట్ చెల్లిస్తే రూ .27 లక్షల రూపాయలను పొందవచ్చు. ఇవే కాకుండా ఎన్నో పాలసీలు పలు రకాలుగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: